పుతిన్ తయారు చేసిన ప్రైవేట్ ఆర్మీ వాగ్నర్ ప్రస్తుతం రష్యాలో ఆధిపత్యం చెలాయిస్తోంది. దీని అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్ తాజాగా అధ్యక్షుడు పుతిన్ తో కొత్త వైరం కొనితెచ్చుకున్నాడు. తన యోధుల్లో 25,000 మంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ప్రిగోజిన్ స్వయంగా చెప్పాడు. శనివారం, ప్రిగోజిన్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్‌లో ఆడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఉక్రెయిన్ నుండి రష్యాలోని రోస్టోవ్ నగరంలోకి వాగ్నర్ యోధులు ప్రవేశించారని సందేశం పేర్కొంది. తనను అడ్డుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే పోరాడతానని ప్రిగోజిన్ స్పష్టం చేశారు. అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా ప్రిగోజిన్ అకస్మాత్తుగా పెద్ద సమస్యగా మారిపోయాడు. ఇది రాజద్రోహమని పుతిన్ పేర్కొన్నారు. అయితే ఒకప్పుడు ప్రస్తుత తిరుగుబాటు నేత ప్రిగోజిన్ అధ్యక్షుడు పుతిన్‌ను నాన్న అంటూ ఆప్యాయంగా పిలస్తూ, తండ్రితో సమానంగా చూసుకునేవాడు.
ప్రిగోజిన్ శనివారం ఉదయం టెలిగ్రామ్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. వాగ్నర్ గ్రూప్ దళాల సభ్యులందరూ రష్యా సైన్యంతో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. ఇదంతా రష్యా ప్రజల కోసమే చేస్తున్నామని ప్రిగోజిన్ చెప్పారు. పోరాటం ఖాయమని అన్నారు. ప్రిగోజిన్ మాట్లాడుతూ అంతర్యుద్ధాన్ని నా తండ్రి సమానమైన పుతిన్ ప్రారంభించారు. ఒకటి లేదా ఇద్దరు వ్యక్తులను పదవీ విరమణ చేయడానికి బదులుగా అతను మొత్తం రష్యాను సమస్యల్లోకి నెట్టేస్తున్నారని విమర్శించాడు. తన అదుపులో ఉన్న 25,000 మంది వీరుల ప్రాణాలను పణంగా పెట్టి మరీ పుతిన్ ను గద్దె దింపి మాస్కోను స్వాధీనం చేసుకుంటానని ప్రిగోజిన్ ప్రకటించాడు.
సాయుధ తిరుగుబాటు ప్రారంభం
ప్రిగోజిన్ తాను మాస్కో వైపు తరలి వస్తున్నా అని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి సందేశం పంపాడు. ఎయిర్‌ఫీల్డ్‌తో సహా నగరంలోని సైనిక సౌకర్యాలను తన దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయని ప్రిగోజిన్ పేర్కొన్నారు. రష్యా వార్తా సంస్థ అలాగే ఇతర ఆన్‌లైన్ పోస్ట్‌లు రోస్టోవ్ పరిపాలనా భవనాలలో వాగ్నర్ గ్రూపు సైనికులు ఉన్నట్లు స్పష్టంగా చూపిస్తున్నాయి. అలాగే నగరంలో ఏర్పాటు చేసిన ట్యాంకులను చుట్టుముట్టి చూపించారు. . శనివారం అత్యవసర టెలివిజన్ ప్రసంగంలో, రష్యా అధ్యక్షుడు పుతిన్ వాగ్నర్ చేత "సాయుధ తిరుగుబాటు" ప్రారంభించబడిందని అన్నారు. రష్యా సైన్యానికి వ్యతిరేకంగా ఎవరు ఆయుధాలు తీసుకున్నా శిక్షించబడతారని హెచ్చరించారు.
Russia-Ukraine Crisis: ఎవ్వరి మాట వినని పుతిన్, ఆక్రమిత ప్రాంతాల్లోకి ...
వెన్నుపోటు పొడిచారు
రష్యాను రక్షించడానికి తాను అన్ని విధాలా చేస్తానని, రోస్టోవ్‌లో పరిస్థితిని స్థిరీకరించడానికి నిర్ణయాత్మక చర్య తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రిగోజిన్ చర్యలు సాయుధ పౌర సంఘర్షణను ప్రారంభించి, ఫాసిస్ట్ అనుకూల ఉక్రేనియన్ దళాలతో పోరాడుతున్న రష్యా సైనికులను వెన్నుపోటు పొడిచేందుకు సమానమని ఆ దేశ భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. ప్రిగోజిన్ చర్యపై రష్యా అధికారులు స్పందిస్తూ పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. అలాగే రాజధానిలో 'యాంటీ టెర్రరిస్ట్' చర్యలు తీసుకుంటున్నట్లు మాస్కో మేయర్ ప్రకటించారు.