Ukraine-President-Volodymyr-Zelensky

Kyiv, OCT 31:  రష్యా – యుక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు (Russia Ukraine War) కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. యుద్ధ నివారణకు ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు సఫలం కాకపోవటంతో ఇరు దేశాల మధ్య మరింత ఉధ్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, అమెరికా నేతృత్వ్యంలో పాశ్చాత్య దేశాలు యుక్రెయిన్ కు (Russia Ukraine War) మద్దతుగా నిలుస్తున్నాయి. అమెరికా ఆ దేశానికి ఆయుధ సామాగ్రిని అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా యుక్రెయిన్ మద్దతు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రష్యా భూభాగంలో సుదూర ప్రాంతాలకుసైతం చేరుకునేలా ధీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించేలా యుక్రెయిన్ కు అనుమతి ఇవ్వాలని అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాల దళాలు యోచిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా సైతం ప్రత్యర్థులు ఎలాంటి దాడులు చేసినా తట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

Israeli Missile Attack: ఇజ్రాయెల్ దాడిలో క్షణాల్లో కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో.. 

అయితే, యుక్రెయిన్ పై యుద్ధానికి ఉత్తర కొరియా (North Korea) సైనికులు రష్యాకు వెళ్లారన్న వార్తలు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. యుక్రెయిన్ పై యుద్ధానికి మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు పెద్దమొత్తంలో రష్యాకు తరలివెళ్లినట్లు దక్షిణ కొరియా ఆరోపిస్తుంది. ఈ విషయంపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడుతూ.. ఉత్తరకొరియా తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశం నుంచి రష్యాకు 10 నుంచి 12వేల మంది సైనికులు వెళ్లినట్లు పేర్కొన్నారు. వారంతా రష్యాకు మద్దతుగా యుక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తమకు సమాచారం ఉందని జెలెన్ స్కీ ఆందోళన వ్యక్తం చేశాడు. రష్యా – యుక్రెయిన్ మధ్య యుద్ధంలో ఉత్తర కొరియా చేరితే ఇండో – పసిపిక్ దేశాలకు ప్రమాదకరమని అన్నారు.

2024 US Elections: నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పోటీ పడుతున్న కమలా హారీస్, డొనాల్డ్  ట్రంప్, ముందస్తు ఓటు హక్కు వినియోగించుకున్న 2.1 కోట్ల మంది ప్రజలు 

రష్యా బలగాలతో కలిసి ఉత్తరకొరియా సైనికులు యుక్రెయిన్ పై పోరాటానికి దిగుతున్నారనే వార్తలపై ఐక్యరాజ్య సమితిలోని యూఎస్ డిప్యూటీ అంబాసిడర్ రాబర్ట్ వుడ్ తీవ్రంగా స్పందించారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పేరును ప్రస్తావించి మరీ వార్నింగ్ ఇచ్చారు. రష్యాకు మద్దతుగా మీ సైనికులు అక్కడికి వెళితే శవాలు బ్యాగుల్లో తిరిగి వెళ్తాయని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అందుకే.. బరిలోకి దిగేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో అంటూ కిమ్ కు రాబటర్ట్ వుడ్ సలహా ఇచ్చాడు. అయితే, కిమ్ మాత్రం రష్యాకు యుక్రెయిన్ సైన్యాన్ని పంపించే విషయంలో వెనక్కు తగ్గేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.