File image of PM Narendra Modi with Mahinda Rajapaksa (Photo Credits: PTI)

New Delhi/Colombo, August 6: శ్రీలంకలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాజపక్స (Mahinda Rajapaksa) కుటుంబ ఆధ్వర్యంలో నడిచే శ్రీలంక పీపుల్స్‌ పార్టీ (ఎస్‌ఎల్‌పీపీ) బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఎస్ఎల్పీపీ మూడింట రెండొంతుల మెజార్టీని సొంతం చేసుకుంది. దీంతో శ్రీలంక ప్రధానిగా మహీంద్ రాజపక్సే కొనసాగనున్నారు. గత నవంబరు నుంచి రాజపక్సే ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లోనూ (Sri Lanka General Elections Results 2020) రాజపక్సే పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన సోదరుడు గోటాబయ రాజపక్సే అధ్యక్షుడిగా ఉన్నారు.

225 మంది సభ్యుల శ్రీలంక పార్లమెంటులో రాజపక్సల శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్ 145 సీట్లను గెలుచుకోగా, దాని ప్రధాన ప్రత్యర్థి 54 సీట్లు మాత్రమే పొందారని ఎన్నికల కమిషన్ ఫలితాలు చూపించాయి. జాతి మైనారిటీ తమిళులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ 10 సీట్లు గెలుచుకుంది, మరో 16 చిన్న పార్టీలలో 16 స్థానాలు విడిపోయాయి. ఇతర చిన్నా చితకా పార్టీలు 16 సీట్లను గెలుచుకున్నాయి. అధికార ఏర్పాటుకు రాజపక్స పార్టీకి మరో నాలుగు చిన్న పార్టీలు తోడవ్వడంతో మరోసారి ప్రధానిగా రాజపక్స కొనసాగనున్నారు. అధికార ఏర్పాటుకు 150 సీట్లు లేదా పార్లమెంటులో మూడింట రెండు వంతుల సీట్లు అవసరం.

Twitter Exchange Between PM Narendra Modi And Mahinda Rajapaksa:

సాజిత్‌ ప్రేమదాసా పార్టీ సమగి జన బళవేగయా (ఎస్‌జేపీ) పరాజయం పాలైంది. ఇక రణిల్‌ విక్రమసింగేకు చెందిన యూనైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యూఎన్‌పీ) కి కనీసం ఐదు శాతం ఓట్లు కూడా రాలేదు. 1977 తొలిసారిగా విక్రమసింగే తన పార్లమెంటు సీటును కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఉత్తర ప్రాంతంలో తమిళ్‌ నేషనల్‌ అలయెన్స్‌ (టీఎన్‌ఏ) కొన్ని పోలింగ్‌ డివిజన్లను దక్కించుకున్నప్పటికీ ఎస్‌ఎల్‌పీపీ మిత్రపక్షం ‘ద ఈలమ్‌ పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ’ (ఈపీడీపీ) నుంచి టీఎన్‌ఏకు ఎదురుదెబ్బ తగిలింది. కరోనాకు మందేమి లేదు..ఎప్పటికీ రాకపోవచ్చు కూడా, కీలక వ్యాఖ్యలు చేసిన డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌

కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలోనూ విజయవంతంగా ఎన్నికలు (Sri Lanka General Elections) నిర్వహించడం విశేషం. కోవిడ్ కారణంగా గతంలో రెండుసార్లు ఎన్నికలను వాయిదా వేశారు. ఎన్నికల్లో మహీంద్ రాజపక్సే విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే, మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడంతో విస్మయం వ్యక్తమవుతోంది. ఈ విజయంతో శ్రీలంక పీపుల్స్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తన తమ్ముడిని గతేడాది డిసెంబర్‌లో 69 లక్షల మంది ఓటర్లు అధ్యక్షుడిని చేశారని, ఈసారి ఇలాంటి మద్దతు లభిస్తుందని ఆయన అన్నారు.

శ్రీలంక ఎన్నికల్లో విజయం సాధించిన మహీంద్ రాజపక్సేకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం రాజపక్సేతో మాట్లాడిన మోదీ.. పార్లమెంటు ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు అభినందించారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ శ్రీలంక ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.