Image used for representation purpose only | Photo: PTI

Atlanta, June 30: అమెరికాలోని అట్లాంటాలో (Atlanta) దారుణం జరిగింది. క్షణికావేశం, ఓ చిన్న పాటి వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కోపంతో ఊగిపోయిన కస్టమర్ గన్ తో కాల్పులు (Shot)జరిపాడు. అసలేం జరిగిందంటే.. 36ఏళ్ల వ్యక్తి అట్లాంటాలో సబ్ వే (Sub Way) రెస్టారెంట్ కు వెళ్లాడు. తనకు శాండ్ విచ్ (Sandwich) కావాలని ఆర్డర్ చేశాడు. కాసేపటికి ఓ మహిళా సర్వర్.. శాండ్ విచ్ తెచ్చి అతడికి ఇచ్చింది. కానీ ఆ శాండ్ విచ్ లో మేయో (Mayo) చాలా ఎక్కువగా ఉందని ఆ కస్టమర్ ఫిర్యాదు చేశాడు. దీని గురించి సర్వర్ తో (Server) వాదనకు దిగాడు. మహిళా సర్వర్ సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా అతను వినలేదు. ఇంతలో మరో మహిళా సర్వర్ అక్కడికి వచ్చి ఆమె కూడా సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే తీవ్ర ఉన్మాదంలోకి వెళ్లిపోయిన కస్టమర్.. తన దగ్గరున్న గన్ బయటకు తీసి ఇద్దరు మహిళా సిబ్బందిపై కాల్పులు జరిపాడు. దీంతో 26 ఏళ్ల మహిళా సర్వర్ స్పాట్ లోనే చనిపోగా.. మరో 24 ఏళ్ల మహిళా సర్వర్ తీవ్రంగా గాయపడింది.

Colombian Prison Riot Fire: జైలులో ఖైదీల మధ్య ఘర్షణ, 51 మంది మృతి, 24 మందికి గాయాలు, నైరుతి కొలబియాలోని తులువా జైలులో విషాద ఘటన  

చనిపోయిన మహిళా సర్వర్ (Woman Server)ఐదేళ్ల కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు. అతడి కళ్ల ముందే తల్లి చనిపోవడం అందరినీ విషాదంలో ముంచింది. రెస్టారెంట్ యజమాని సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని.. ఈ దుర్మార్గానికి పాల్పడ్డ కస్టమర్ ను అరెస్టు చేశారు.

Boris Johnson: పుతిన్ ఆడది అయి ఉంటే... సంచలన వ్యాఖ్యలు చేసిన బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్, ఆయన అమ్మాయి అయి ఉంటే యుద్ధానికి వెళ్లేవాడు కాదని తెలిపిన బోరిస్ జాన్స‌న్  

ఈ ఘటన స్థానికులను షాక్ కి గురి చేసింది. శాండ్ విచ్ లో మేయో (Mayo) ఎక్కువైందంటూ గొడవకు దిగి కాల్పులు జరపడం దారుణం అంటున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని, ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.