Suicide Capsule: ఆత్మహత్యలకు స్విట్లర్లాంట్‌ చట్టబద్దత, సూసైడ్ బాక్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్విస్, ఈ నిర్ణయం మండిపడుతున్న మానవహక్కుల సంఘాలు

Switzerland  December 08: చావును చట్టబద్దం చేసి స్విట్జర్లాండ్(Switzerland) అవును ఎలాంటి నొప్పి లేకుండా కేవలం పది నిమిషాల్లో చనిపోయేందుకు ఉపయోగించే ప్రత్యేక క్యాప్సూల్స్(suicide capsule) వాడకానికి స్విస్ ప్రభుత్వం అనుమతిచ్చింది. సార్కో క్యాప్సూల్ (Sarco capsule )  అని పిలిచే ఈ పెట్టెలను సూసైడ్‌ కోసం ఉపయోగించేలా తయారు చేశారు. వీటిని లోపల పడుకునే వ్యక్తే ఆపరేట్‌ చేసుకోగలగడం, ఎక్కడికంటే అక్కడికి మోసుకెళ్లడం ప్రత్యేకతలు.

ఈ ప్యాడ్‌లో పడుకున్న వ్యక్తిని ముందుగా కొన్ని ప్రశ్నలు(pre-recorded questions) అడుగుతారు. ఆ తర్వాత యాక్టివ్‌ బటన్‌ను నొక్కేందుకు ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇస్తారు. బటన్‌ నొక్కగానే నైట్రోజన్‌ వాయువు రిలీజ్‌ అవుతుంది.  కేవలం 30 సెకన్లలో ఆక్సిజన్‌ లెవల్‌ 21 శాతం నుంచి 1 శాతానికి పడిపోతుంది. స్పృహ కోల్పోయిన వ్యక్తి నిమిషాల వ్యవధిలోనే ప్రాణం విడుస్తాడు. ఈ ప్రాసెస్‌లో కణజాలానికి తక్కువ ఆక్సిజన్‌ పంపిణీ (hypoxia) రక్తంలో కార్బన్‌ డై యాక్సైడ్‌(carbon dioxide) లెవల్‌ తక్కువ కావడం(hypochondria)  ద్వారా మరణం సంభవిస్తుంది.

క్యాబిన్‌లో ఉన్న వ్యక్తి స్పృహలోకి జారుకునే క్రమంలో.. కంటి చూపు తప్ప శరీర కదలికలు పని చేయవు. తద్వారా ప్రాణం పోయేటప్పుడు గిలగిలలాడేందుకు వీలు కూడా ఉండదంటున్నారు నిపుణులు. ఆస్ట్రేలియాకు చెందిన ఎగ్జిట్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌, డాక్టర్‌ డెత్‌గా  పేరున్న ఫిలిప్‌ నిట్స్‌చెకే ఈ క్యాప్సుల్‌ను రూపొందించాడు. వీటి తయారీపై దుమారం రేగుతోంది. ఆత్మహత్యలను ప్రోత్సహించేలా ఇది ఉందని మండిపడుతున్నారు ప్రజలు.

Italy Man Fake Arm: నకిలీ చెయ్యికి కోవిడ్ వ్యాక్సిన్, సర్టిఫికెట్ కోసం ఇటలీ వ్యక్తి అతి తెలివి ప్రదర్శన, నర్సు గుర్తించడంతో అడ్డంగా బుక్కయిన హెల్త్ వర్కర్

కానీ అసిస్టెడ్‌ సూసైడ్‌కు స్విట్జర్లాండ్‌ (Switzerland ) లోనూ చట్టబద్దత ఉంది. కిందటి ఏడాది 1,300 మంది ఇలా చనిపోయారు. కానీ ఇలాంటి మరణాలకు ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. అదీ లిక్విడ్‌ సోడియం పెంటోబార్బిటల్‌ (sodium phenobarbital) ను ఇంజెక్షన్‌ ద్వారా ఎక్కించి చనిపోయేలా చేసేవాళ్లు. ఇక ఇప్పుడు సార్కో క్యాప్సూల్స్‌ ద్వారా అనుమతి ఇచ్చారు.

దీనిపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ స్విస్‌ ప్రభుత్వం వెనకడుగు వేయట్లేదు. ఇక ఎగ్జిట్‌ ఇంటర్నేషనల్‌ ఇప్పటికే రెండు మోడల్స్‌ సార్కో లను తయారు చేసింది. ఇప్పుడు రూపొందించింది త్రీడీ ప్రింట్‌ టైప్‌. కాకపోతే వచ్చే ఏడాది నుంచి ఇది స్విస్‌ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.