Italy Man Fake Arm: నకిలీ చెయ్యికి కోవిడ్ వ్యాక్సిన్, సర్టిఫికెట్ కోసం ఇటలీ వ్యక్తి అతి తెలివి ప్రదర్శన, నర్సు గుర్తించడంతో అడ్డంగా బుక్కయిన హెల్త్ వర్కర్

Italy December 04: కొత్త కొత్త వేరియంట్లు వచ్చి ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నప్పటికీ కొందరు వ్యాక్సిన్ వేసుకునేందుకు భయపడుతున్నారు. అయితే కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్(vaccine certificate) తప్పనిసరి చేయడంతో…దానికోసం అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. అలాంటి ఘటనే ఇటలీలో జరిగింది. వ్యాక్సిన్‌ సర్టిఫికెట్ కోసం ఏకంగా ఫేక్ చేయి(Fake Arm)ని పెట్టుకొని వ్యాక్సిన్ వేయించుకోబోయాడు.

50 ఏళ్ల ఇటాలియ‌న్‌(Italian man)కు వ్యాక్సిన్ వేసుకోవ‌డం ఇష్టం లేదు. కానీ వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేయ‌డంతో కృత్రిమ చేయి(fake arm)ని పెట్టుకొని బియెల్లాలోని హెల్త్ సెంట‌ర్‌కు వెళ్లాడు. అయితే అతనికి వ్యాక్సిన్ వేయబోయి నర్సు…అది నిజ‌మైన చేయి కాద‌ని గుర్తించింది. దాని గురించి అతన్ని నిలదీసింది. దాంతో అతను ఆ నర్సు(health worker)కు డబ్బు ఆశచూపించాడు. కానీ.. త‌ను వెంట‌నే త‌న పైఅధికారుల‌కు ఫిర్యాదు చేసింది. అత‌డు కూడా హెల్త్ వ‌ర్కరే కావ‌డం, ఇప్పటి వ‌ర‌కు వ్యాక్సిన్ వేసుకోక‌పోవ‌డంతో అతన్ని విధుల‌ నుంచి అధికారులు స‌స్పెండ్ చేశారు.

Chinese COVID-19 Vaccines: మేడ్ ఇన్ చైనా వ్యాక్సిన్, చైనా తయారు చేసిన వ్యాక్సిన్లకు సామర్థ్యం చాలా తక్కువ, ర‌క్ష‌ణ క‌ల్పించే శ‌క్తి లేదు, సంచలన విషయాలను వెల్లడించిన ఆ దేశ ప్రభుత్వ ఉన్నతాధికారి

ఇట‌లీలో ప్రభుత్వం కోవిడ్(Covid-19) విష‌యంలో చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవుతోంది. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకే సూప‌ర్ గ్రీన్ పాస్‌ను అందిస్తోంది. ఆ పాస్ ఉన్నవాళ్లకే రైల్వే స్టేష‌న్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, జిమ్‌, స్విమ్మింగ్ పూల్స్ లోకి అనుమ‌తిస్తోంది. దీంతో కోవిడ్ సర్టిఫికెట్ కోసం ఇలా అతి తెలిపి ప్రదర్శించాడు.