Hyderabad, Oct 7: తెలంగాణ (Telangana) సంస్కృతిని చాటే బతుకమ్మ (Bathukamma Festival) పండుగ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. ఇప్పటికే పలు దేశాల్లో బతుకమ్మ సంబురాలు ప్రారంభం కావడం తెలిసిందే. ప్రతిష్టాత్మక వైట్ హౌజ్, ఆస్ట్రేలియా ఒపేరా హౌజ్, లండన్ బ్రిడ్జ్, ఐపిల్ టవర్ తదితర చోట్ల వేడుకగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నారు కూడా. తాజాగా అమెరికాలోని పలు రాష్ట్రాలు బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపునిచ్చాయి. అంతేకాదు ఈ వారాన్ని బతుకమ్మ వారంగా జరుపుకోనున్నట్టు ప్రకటించాయి. దీంతో తెలంగాణవాదులు పులకించిపోతున్నారు.
Here's Video:
అమెరికాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు... pic.twitter.com/uyCMdtL1mc
— ChotaNews (@ChotaNewsTelugu) October 7, 2024
ఏ రాష్ట్రాల్లో గుర్తింపు
నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్టే రాలేహ్, వర్జీనియా రాష్ట్రాలు బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఈ వారాన్ని బతుకమ్మ పండగ, తెలంగాణ హెరిటేజ్ వీక్ గా ప్రకటించారు.