Chinese Kissing Device (PIC @ Google)

New Delhi, FEB 25: చైనాలోని ఓ యూనివర్సిటీ ఓ డివైజ్ (Device) కనిపెట్టింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. దాని పేరేంటో తెలుసా..? "Kissing Device". దూరంగా ఉన్న ప్రేమికుల కోసం తయారు చేసిందే ఈ పరికరం. వర్చువల్‌గా ఒకరికొకరు ముద్దు పెట్టుకోవచ్చు. ఈ డివైస్‌కి సిలికాన్ లిప్స్‌ అమర్చారు. వీటికి ప్రెజర్ సెన్సార్లు పెట్టారు. వాటిని ముద్దు పెట్టుకుంటే నిజంగా "కిస్" ఇచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. చైనాలోని గ్లోబల్ టైమ్స్‌ ఈ డివైజ్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ముద్దు పెట్టుకున్నప్పడు ఉండే ప్రెజర్‌తో పాటు టెంపరేచర్‌నూ ఫీల్ అయ్యేలా తయారు చేశారీ పరికరాన్ని. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భలే ఫన్నీగా ఉందే అని కొందరు కామెంట్ పెడుతుంటే...మరి కొందరు ఇదేం డివైజ్ అంటూ పెదవి విరుస్తున్నారు. మైనర్లు కూడా వీటిని కొనుగోలు చేసి వినియోగించే ప్రమాదముందని మండి పడుతున్నారు.

Heavy Snowfall In US: వీడియో ఇదిగో.. అమెరికాపై మరోసారి విరుచుకుపడిన మంచుతుఫాను,1500కుపైగా విమానాలు రద్దు, 2.80 లక్షల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా కట్  

ఈ వర్చువల్ కిస్‌ను (Virtual Kiss) ఫీల్ అవ్వాలంటే ముందు ఓ యాప్‌ డౌన్‌లోడ్ (APP Download) చేసుకోవాలి. ఆ తరవాత ఛార్జింగ్ పోర్ట్‌కు కేబుల్‌తో ఈ డివైజ్‌ను కనెక్ట్ చేయాలి. పార్ట్‌నర్‌తో పెయిర్ అవ్వాలి. ఆ తరవాత వీడియో కాల్ చేసుకుని ముద్దు ముద్రలు వేసుకోవచ్చు. దీన్ని ఆవిష్కరించిన జియాంగ్ జోంగ్లీ ఆసక్తికర విషయాలు చెప్పారు. తన గర్ల్‌ఫ్రెండ్‌కు దూరంగా ఉన్నప్పుడు కేవలం ఫోన్‌లో మాత్రమే టచ్‌లో ఉన్నానని, అప్పుడే ఈ ఐడియా తట్టిందని వివరించారు. 2016లో మలేషియాలో Imagineering Institute ఇదే తరహా పరికరం తయారు చేసింది. దాని పేరు "Kissinger".టచ్ సెన్సిటివ్ సిలికాన్ ప్యాడ్‌ రూపంలో దీన్ని రూపొందించింది.

Xylazine: యుఎస్‌ను వణికిస్తున్న జిలాజైన్ డ్రగ్, చర్మం కుళ్లిపోయి జాంబీల మాదిరిగా తయారవుతున్న అమెరికన్లు, అసలేంటి ఈ జైలజీన్‌ డ్రగ్, ఎందుకు అంతలా బానిస అవుతున్నారు  

అయితే...చైనాలో తయారైన కొత్త డివైజ్‌తో తెలియని వ్యక్తులతోనూ పెయిర్ అయ్యి ముద్దులు పెట్టేయొచ్చు. ముద్దు ముద్రల్ని యాప్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. పార్ట్‌నర్‌ ఆ కిస్‌ని డౌన్‌లోడు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ డివైజ్ ధర 288 యువాన్లు. అంటే మన కరెన్సీలో రూ.3,433.