UK Health Secretary Matt Hancock (Photo Credits: Twitter)

London, June 27: బ్రిటన్‌ ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శి మ్యాట్‌​ హాంకాక్‌ ఆఫీసులో పీఏతో సాగించిన రాసలీలల వ్యవహారం ఆయన పదవికి ఎసరు తెచ్చిపెట్టింది. తన సహాయకురాలికి ముద్దిచ్చి వివాదాస్పదంగా మారిన మంత్రి మాట్ హాంకాక్ ఎట్టకేలకు రాజీనామా (UK Health Minister Matt Hancock Resigns) చేశారు. ముందుగా ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు తనను క్షమించాలంటూ హాంకాక్‌ లేఖ రాశారు. దాంతో ఇంతటితో ఈ విషయాన్ని ముగిస్తున్నట్లు బోరిస్‌ జాన్సన్‌ కూడా శనివారం ఉదయం ప్రకటించారు. అయితే, విపక్షాల నుంచి ముప్పేటదాడి తప్పకపోవడంతో తప్పనసరి పరిస్థితుల్లో మంత్రి పదవికి హాంకాక్‌ రాజీనామా సమర్పించారు. ఆయన స్థానంలో మాజీ ఆర్థిక మంత్రి జావేద్ కి (Sajid Javid) అవకాశం ఇచ్చారు.

ప్రస్తుత కరోనా వ్యాప్తి సమయంలో నిబంధనలను అతిక్రమించి (breaching Covid protocols) సహాయకురాలిని ముద్దుపెట్టుకున్నారని మాట్‌ హాంకాక్‌పై ఆరోపణలు ఉన్నాయి. హాంకాక్‌ ముద్దు భాగోతాన్ని సన్‌ వార్తాపత్రిక మొదటి పేజీలో ప్రధానంగా ప్రచురించింది. ఆమెను ముద్దులు పెట్టుకున్నట్లుగా ఓ ఫొటోతో ‘పీఏతో హాంకాక్‌ రాసలీలలు’ పేరుతో ది సన్‌ టాబ్లాయిడ్‌ ప్రముఖంగా ప్రచురించింది. పైగా కరోనా నిబంధనలు అమలులో ఉన్న టైంలో ఆ పని చేశాడంటూ కథనం ప్రచురించింది.

బీజేపీ మంత్రి రాసలీలల వీడియో వైరల్, జలవనరుల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన కర్ణాటక బీజేపీ నేత రమేశ్‌ జార్కిహొళి, నిర్దోషిగా బయటకు వస్తాను, అది ఫేక్ వీడియో అని తెలిపిన రమేశ్‌

కాగా, ఆ ఫొటోలు మే 6 నుంచి 11 మధ్య కాలంలో, అది కూడా మ్యాట్‌ కార్యాలయంలోనే తీసినవని సమాచారం. అయితే ఆ ఫొటోల్ని ఎలా సంపాదించింది మాత్రం సన్‌ వెల్లడించలేదు. అప్పటికీ ఇంకా లాక్‌డౌన్ కఠిన నిబంధనల్ని, ఆంక్షల్ని ఎత్తివేయలేదని మాత్రం పేర్కొంది. ఇంట్లో వ్యక్తులతో తప్ప బయటివారిని కౌగిలించుకోవడం, వారితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి అనుమతించని రోజుల్లో ఈ ఘటన జరిగిందని తెలిపింది.

అంతేకాకుండా ఆ ఫొటోలో ఉన్న మహిళను హాంకాక్‌.. 2000 సంవత్సరంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో కలిశాడని, పోయిన నెలలోనే ఆమెను ఇన్‌కంటాక్స్‌ విభాగంలో తన సహాయకురాలిగా నియమించుకున్నాడని తేలింది.అయితే కొవిడ్‌ మహమ్మారి మార్గదర్శకాలను పట్టించుకోకుండా కార్యాలయంలో సహాయకురాలిని ముద్దుపెట్టుకోవడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. దాంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని హాంకాక్ నిర్ణయించుకున్నారు. ‘వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సాధారణ ప్రజలు చేస్తున్న త్యాగాలు చూస్తే.. మనం వారికి ఏదైనా తప్పు చేస్తే.. నిజాయితీగా ఉండటం మన బాధ్యత అవుతుంది’ అని తన రాజీనామా లేఖలో హాంకాక్‌ పేర్కొన్నారు.

మంత్రి రమేశ్‌ జార్కిహొళి సెక్స్ వీడియో బయటకు, కర్ణాటక రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతున్న సీడీ

ఇలాఉండగా, 42 ఏండ్ల వయసున్న హాంకాక్‌, 15 ఏండ్ల క్రితం పెండ్లి చేసుకున్నాడని, భార్య మార్తతో ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యారని సన్‌ పత్రిక తన కథనంలో తెలిపింది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో సహవిద్యార్థిగా ఉన్న సమయంలో పరిచయంతో హాంకాక్‌ ఆమెను తన సహాయకురాలిగా నియమించుకున్నారని, ఆమెను పెండ్లి కూడా చేసుకున్నట్లు సమాచారం ఉన్నదని ది సన్‌ పత్రిక తన కథనంలో పేర్కొన్నది.

తనతో హాంకాక్‌ ముద్దు సీన్‌ వివాదం కావడంతో హాంకాక్‌ కన్నా ముందే ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా తెలిసింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరోగ్య శాఖలో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హోదా ఉద్యోగంలో ఆమెను గత ఏడాది సెప్టెంబర్‌ నెలలో హాంకాక్‌ నియమించారు. ఏడాది కాలంలో 15-20 రోజులు మాత్రమే పనిచేసేలా, 15,000 పౌండ్ల జీతంతో ఆమెను హాంకాక్‌ నియమించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.