UK PM Boris Johnson. (Photo Credits: Twitter)

London, July 06: బ్రిటన్ లో ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులు(Ministers) రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ లు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. రాజీనామా అనంతరం రిషి సునాక్ (Rishi Sunak)మాట్లాడుతూ.. బ్రిటన్ కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాలని అన్నారు. కానీ బోరిస్ సారథ్యంలోని ప్రభుత్వం ఆ మేరకు పని చేయడంలో విఫలమైందని, అందుకు ఆయన మంత్రి వర్గం(cabinet) నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఇద్దరు మంత్రులు రాజీనామా చేసి ఒక్కరోజు గడవక ముందే మరో ఐదుగురు మంత్రులు రాజీనామాలు చేశారు. వీరిలో కెమి బాడెనోచ్, నీల్ ఓ బ్రియన్, అలెక్స్ బర్గార్ట్, లీరౌలీ, జూలియా లోఫెజోలు ఉన్నారు.

UK Covid Cases: బ్రిటన్‌ లో కరోనా 5 వేవ్, రోజుకు 3లక్షలకు పైగా కరోనా కేసులు, అధికారికంగా ప్రకటించని ప్రభుత్వం, కలకలం సృష్టిస్తున్న యూనివర్సిటీ ప్రొఫెసర్ ట్వీట్, పేషెంట్లతో నిండిపోతున్న ఆస్పత్రులు 

వారు మాట్లాడుతూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బోరిస్‌ జాన్సన్‌ను ఉన్నత పదవిలో కూర్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రాజీనామా తప్ప మరో మార్గం లేదని లేఖలో స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బోరిస్ జాన్సన్ (Boris Johnson)​ ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయినందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

China Flights: రెండేళ్ల తర్వాత చైనాకు అంతర్జాతీయ విమాన సర్వీసులు షురూ, ఇండియాకు మాత్రం నో ఫ్లైట్స్, భారతీయ విద్యార్ధులకు అనుమతిపై ఇంకా వెలువడని నిర్నయం 

వరుసగా మంత్రులు రాజీనామా చేస్తుండటంతో బోరిస్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఇటీవలే అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కిన బోరిస్ ప్రభుత్వం .. తాజాగా వరుసగా మంత్రులు రాజీనామాలు చేస్తుండటంతో కుప్పకూలే అవకాశాలు ఉన్నాయి. అయితే రిషీ సునాక్ రాజీనామాతో ఆయన స్థానంలో జహావీని ఆర్ధికశాఖ మంత్రిగా నియమిస్తూ బోరిస్ జాన్సన్ నిర్ణయం తీసుకున్నారు.