Flights- Representative Image | File Photo

Beijing, July 05: దాదాపు రెండేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని(International Services) చైనా(China) ప్రారంభించింది. కోవిడ్ (Covid) కారణంగా ఈ విమాన సర్వీసులపై 2020లో చైనా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, అన్ని దేశాలకు సంబంధించిన విమాన సర్వీసుల్ని మాత్రం ఇంకా అనుమతించడం లేదు. అందులో ఇండియా (India) కూడా ఒకటి. మన విమానాల ఎంట్రీకి చైనా అనుమతించడం లేదు. మన విమానాలతోపాటు భారతీయులకు వీసాల జారీపై కూడా చైనా నిషేధం విధించింది. అయితే, భారతీయులకు వీసాల జారీపై ఉన్న నిషేధాన్ని గత నెలలోనే ఎత్తివేసింది. అయినప్పటికీ, మన విమానాలకు(Flights) మాత్రం అనుమతివ్వడం లేదు. దీంతో చైనాలో చదువుకుని, కోవిడ్ కారణంగా మధ్యలో వదిలేసి వచ్చిన వాళ్లు, ఉద్యోగులు ఎందరో చైనా తిరిగి వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. ఆ దేశం నుంచి ఇండియా తిరిగొచ్చిన వారంతా ఇక్కడే ఉండిపోయారు. అక్కడ ఎక్కువగా భారతీయ విద్యార్థులు మెడిసిన్ చదువుకుంటారు.

మెడికల్ విద్యార్థులతోపాటు, ఇతర కోర్సులు చేసే దాదాపు 23,000 మంది విద్యార్థులు ఇండియా వచ్చేశారు. చైనా-భారత్ మధ్య 2020 నవంబర్ నుంచి విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఏడాదిన్నర గడిచినా మన విమానాల రాకపోకల విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు భారతీయ విద్యార్థుల్ని అనుమతించే అంశంపై చైనా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Subway Employee Shot Dead By Customer: శాండ్‌విచ్‌లో క్రీమ్ ఎక్కువైందని సర్వర్‌ను కాల్చి చంపాడు, అమెరికా సబ్‌ వేలో ఘటన, మరో మహిళకు తీవ్రగాయాలు, మృతురాలి ఐదేళ్ల కుమారుడు కళ్లెదుటే కాల్చి చంపిన ఉన్మాది 

దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నట్లు చైనా తెలిపింది. విదేశాల నుంచి చైనా వచ్చే వారి క్వారంటైన్ నిబంధనల్లో కూడా మార్పులు చేసింది. నిర్దేశించిన హోటల్స్‌లో ఏడు రోజులపాటు, ఇంట్లో మూడు రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండాలి.

Chicago: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత, ఇష్టం వచ్చినట్లుగా కాల్పులతో విరుచుకుపడిన దుండుగుడు, ఘటనలో ఆరుమంది మృతి, 20 మందికి పైగా గాయాలు, నిందితుడిని అరెస్ట్ చేసిన చికాగో పోలీసులు 

చైనా తాజా నిర్ణయంతో దాదాపు 125 దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 2,025 ప్యాసింజర్ విమానాలు రాకపోకలు సాగిస్తాయి. ఇప్పటికే శ్రీలంక, రష్యా, నేపాల్, పాకిస్తాన్ దేశాలకు చెందిన సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే, పరిమితంగానే విమానాల్ని అనుమతిస్తోంది. చైనా-భారత్ మధ్య విమాన సర్వీసుల్ని ప్రారంభించేందుకు ఇరుదేశాలు చర్చిస్తున్నాయని అధికారులు తెలిపారు.