Newdelhi, May 1: హిందూదేవత (Hindu Godess) కాళీ మాతను (Maa Kali) అవమానిస్తూ ఉక్రెయిన్ (Ukraine) రక్షణ మంత్రిత్వ శాఖ పెట్టిన మార్ఫింగ్ ఫొటో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై భారతీయులు (Indians) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళీమాతను హాలీవుడ్ తార మార్లిన్ మన్రోతో పోలుస్తారా? అంటూ మండిపడ్డారు. హిందూ ఫోబియాతోనే ఉక్రెయిన్ ఈ దుశ్చర్యకు పాల్పడిందంటూ విమర్శించారు.
Morphed image tweeted by the #Ukraine's defence ministry triggered outragehttps://t.co/GEw0gVYqtf
— Hindustan Times (@htTweets) April 30, 2023
ట్వీట్ లో ఏం ఉందంటే?
యుద్ధం కారణంగా జరిగిన భారీ పేలుడు, దాని వల్ల ఏర్పడిన పొగ, మంటను ఒక పక్క, అదే ఆకారంలో హిందువుల దేవత కాళీమాత బొమ్మను మార్ఫింగ్ చేసి పొగ స్థానంలో మెడలో పుర్రెలతో, ఆగ్రహంతో నాలుక చాపి ఉన్న ఆమె గౌన్ ధరించినట్టు, అది ఎగురుతున్నట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దీనిపై భారత్‌లో తీవ్ర దుమారం రేగి, వెంటనే ఉక్రెయిన్ ప్రభుత్వం దీనికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఆ ట్వీట్ ను తొలగించింది.