Afghanistan: స్త్రీల స్వేచ్చను హరించేలా తాలిబన్లు మరో సంచలన నిబంధన, మహిళలకు యూనివర్సిటీ విద్యను నిషేధిస్తూ ఆదేశాలు, తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ప్రపంచ దేశాలు
Afghan Women (Photo Credit: PTI)

Kabul, Dec 21: స్త్రీల స్వేచ్చను హరించేలా తాలిబన్లు (Taliban) మరో సంచలన నిబంధన తీసుకువచ్చారు. దేశ వ్యాప్తంగా మహిళలకు యూనివర్సిటీ(విశ్వవిద్యాలయ) విద్యను నిషేధిస్తూ (Ban Women From University-Level Education) తాలిబాన్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. మహిళా విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేడా మహ్మద్ నదీమ్ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలుపుతూ మేరకు ట్వీట్‌ చేశారు.

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సెక్స్ ఆడియో కాల్ లీక్, ప్రైవేట్ పార్ట్‌లు నొప్పితో ఉన్నాయంటున్న మహిళ, సోషల్ మీడియాలో ఆడియో వైరల్

న్యూయర్క్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశమై.. తాలిబన్లు నిర్భంధించిన ఇద్దరు అమెరికన్లు విడుదల చేస్తున్నట్లు యూఎస్‌ విదేశాంగశాఖ వెల్లడించిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. తాలిబన్ల నిర్ణయంపై అమెరికాతోపాటు ప్రపంచ దేశాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున​ాయి. తాజాగా మహిళలను ఆంక్షలకు గురిచేస్తున్న తాలిబన్లపై అమెరికన్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మండిపడ్డారు.

చైనాలో కరోనా కల్లోలంపై షాకింగ్ రిపోర్ట్, డ్రాగన్ కంట్రీకి మూడ్ వేవ్‌ల ముప్పు, 10 లక్షలకుపైగా మరణాలు సంభవించే అవకాశం, చైనా నిపుణుల అధ్యయనంలో వెల్లడి

ఆప్గనిస్థాన్‌లోని అందరి హక్కులను గౌరవించే వరకు అంతర్జాతీయ సమాజంలో చట్టబద్ధమైన సభ్యులుగా ఉండేందుకు తాలిబన్లను ఆశించలేమని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఒక ప్రకటనలో తెలిపారు.తాలిబన్లు అఫ్గనిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తరువాత మహిళ హక్కులు పూర్తిగా హరించివేశారు. వారిని ఇప్పటికే ఉన్నత విద్యకు దూరం చేశారు. అనేక ఉద్యోగాల్లో మహిళలపై ఆంక్షలు విధించారు. దేశ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్‌ ధిరంచాల్సిందేనని ఆదేశించారు.తాజాగా యూనివర్సిటీ విద్యకు కూడా దూరం చేశారు.