US Election 2020: అమెరికా హీరో ఎవరు..జీరో ఎవరు? వెనుకబడిన ట్రంప్, దూసుకెళ్తున్న బైడెన్, 270 ఎలక్టోర‌ల్ ఓట్లు గెలుచుకున్నవారికే అమెరికా అధ్యక్ష పీఠం
US Election 2020

Washington, Nov 4:  అధ్యక్షుడిని ఎన్నుకొనేందుకు అమెరికా ప్రజలు కరోనా భయాలను లెక్కచేయకుండా చాలా రాష్ర్టాల్లో మంగళవారం ఉదయం 6 గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు వందల సంఖ్యలో బారులు తీరారు. రాత్రి 9 గంటల ( భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 7 గంటల వరకు) వరకు పోలింగ్‌ (US election 2020) జరుగుతుంది. ఈసారి భారీగా మెయిల్‌ ఇన్‌ ఓట్లు నమోదవటంతో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది.

ఎన్నికలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రజలందరూ ఓటింగ్‌లో పాల్గొనాలని రిపబ్లికన్‌, డెమోక్రాటిక్‌ అభ్యర్థులు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump), జో బిడెన్‌ (Joe Biden) పిలుపునిచ్చారు. కాగా న్యూహ్యాంప్‌షైర్‌లో తొలి ఫలితం వెల్లడైంది. ఇక్కడ 10 ఎలక్టోరల్‌ ఓట్లు బిడెన్‌ గెలుచుకోగా, 16 ఓట్లు ట్రంప్‌ ఖాతాలోకి వెళ్లాయి.

మొత్తం 538 స్థానాల్లో బైడెన్ 218 చోట్ల ముందంజ‌లో ఉండ‌గా, ట్రంప్ 148 చోట్ల ఆధిక్యంలో కొన‌సాగుతున్నారని వార్తలు వస్తున్నాయి. ట్రంప్ సొంత‌రాష్ట్ర‌మైన న్యూయార్క్‌లో బైడెన్ గెలుపొందారు. అదేవిధంగా వ‌ర్జీనియా, వెర్మాంట్‌, మేరీలాండ్‌, న్యూజెర్సీ, మ‌సాచుసెట్స్‌, కొరాడో, కనెక్టిక‌ట్ రాష్ట్రాల్లో కూడా జ‌య‌కేత‌నం ఎగురువేశారు.

మగవారిని మాత్రమే చంపేస్తోన్న కొత్త వ్యాధి, అంతుచిక్కని వ్యాధికి వెక్సాస్ సిండ్రోమ్‌గా నామకరణం చేసిన సైంటిస్టులు, అమెరికాలో పలువురు మృత్యువాత

డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన రాష్ట్రాలను, ఎలక్టోరల్ ఓట్లను పరిశీలిస్తే, అలబామా (9), అర్కాన్సాస్ (6), ఇండియానా (11), కెంటుకీ (8), లూసియానా (8), మిసిసిపీ (6), నార్త్ డకోటా (3), ఓక్లాహామా (7), సౌత్ కరోలినా (9), సౌత్ డకోటా (3), టెన్నిస్సీ (11), వెస్ట్ వర్జీనియా (5), వ్యోమింగ్ (3), వ్యోమింగ్‌, క‌న్సాస్‌, మిస్సోరి, మిసిసిపీ ఉన్నాయి.

ఇక బైడెన్ గెలిచిన రాష్ట్రాలు, ఎలక్టోరల్ ఓట్లను పరిశీలిస్తే, కొలరాడో (9), కనెక్టికట్ (7), డెలావర్ (3), డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా (3), ఇల్లినాయిస్ (20), మేరీల్యాండ్ (10), మసాచుసెట్స్ (11), న్యూజర్సీ (14), న్యూయార్క్ (29), రోడ్ ఐలాండ్ (4), వెర్మాంట్ (3), వర్జీనియా (13), న్యూ మెక్సికో, న్యూ హ్యాంప్‌షైర్‌, దిలావేర్‌, వాష్టింగ‌న్‌, ఓరేగాన్‌, కాలిఫోర్నియా ఉన్నాయి.

కెంట‌కీ, ఇండియానా, అల‌బామా, ఓక్ల‌హామా, వెస్ట్ వ‌ర్జీనియా, సౌత్ క‌రోలీనా, టెన్నెస్సీ, సౌత్ డ‌కోటా, నార్త్ డ‌కోటా రాష్ట్రాల్లో ట్రంప్ విజ‌యం సాధించారు. జార్జియా, మిచిగ‌న్‌, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ట్రంప్ వెనుక‌బ‌డిపోయారు. మొత్తంగా 270 ఎలక్టోర‌ల్ ఓట్లు గెలుచుకున్న‌వారినే అధ్య‌క్ష‌పీఠం వ‌రిస్తుంది.

ఎర్లీ ఓటింగ్ లెక్కింపును ఆపాల‌న్న‌ ట్రంప్ అభ్య‌ర్థ‌న‌ను నెవెడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ముద‌స్తుగా ఓటేసిన 10 కోట్ల మందిలో మెజారిటీ ఓట‌ర్లు బైడెన్ వైపే నిలిచారని అంచ‌నావేస్తున్నారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో గ‌త వందేండ్ల‌లో తొలిసారిగా అత్య‌ధిక ఓటింగ్ న‌మోద‌య్యింది. 1908లో అత్య‌ధికంగా 65 శాతం మంది ప్ర‌జ‌లు త‌మ ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. ఆత‌ర్వాత అంత భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఓట్లు వేసింది ఇప్పుడే కావ‌డం విశేషం. నిన్న జ‌రిగిన ఓటింగ్‌లో మొత్తం 67 శాతం మంది త‌మ ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. 65 శాతం మంది యువ‌త బైడెన్ వైపే మొగ్గుచూపిన‌ట్లు సర్వేల్లో తేలింది.