VEXAS: మగవారిని మాత్రమే చంపేస్తోన్న కొత్త వ్యాధి, అంతుచిక్కని వ్యాధికి వెక్సాస్ సిండ్రోమ్‌గా నామకరణం చేసిన సైంటిస్టులు, అమెరికాలో పలువురు మృత్యువాత
virus Spread (Photo Credit: IANS)

Washington, Oct 30: ప్రపంచం కోవిడ్ తో అల్లాడుతుంటే మరో కొత్త వ్యాధి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. మగవారిని మాత్రమే ప్రభావితం చేస్తున్న కొత్త ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ను సైంటిస్టులు కనుగొన్నారు. దీనికి ‘వెక్సాస్ సిండ్రోమ్’గా (VEXAS syndrome) నామకరణం చేశారు. జన్యుపరమైన ఈ వ్యాధితో అమెరికాలో చాలా మంది మగవారు మృతి చెందారు. అయితే దానికి సంబంధించిన కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు.

అయితే ఇటీవలే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ఈ వ్యాధిగల కారణాన్ని కనుగొని దీనికి వెక్సాస్ అనే పేరుపెట్టింది. సాధారణంగా మన శరీరంలోకి హానికరమైన వైరస్‌లుకానీ, బ్యాక్టీరియాలు కానీ ప్రవేశించినప్పుడు సహజంగా మన దేహంలో ఉండే వ్యాధినిరోధక కణాలైన తెల్ల రక్త కణాలు వాటిపై దాడి చేసి వాటిని అంతమొందిస్తాయి. అయితే ఈ వ్యాధిలో మాత్రం బయట నుంచి ఎలాంటి హాని కలిగించే జీవులు శరీరంలోకి ప్రవేశించనప్పటికి ఈ కణాలు యుద్దాన్ని చేస్తూ మన శరీరంపైనే దాడిచేసి మంటను రగిలిస్తాయి.

వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్, ఢిల్లీలో మూడవ దశకు కోవిడ్, మళ్లీ లాక్‌డౌన్ దిశగా ప్రపంచంలోని పలు దేశాలు, దేశంలో తాజాగా 48,648 మందికి కరోనా పాజిటివ్‌

దాని వలన నరాల్లో రక్తం గడ్డకట్టడం, తరుచు ఫీవర్‌రావడంలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వ్యాధి సోకిన వారిలో అదేమిటో వైద్యులు సరిగా గుర్తించలేకపోయేవారు. ఆ వ్యాధి సోకిన వారిలో 40శాతం మంది మరణిస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన 25,000మందికి పైగా ప్రయోగాలు చేశామని శాస్త్రవేత్తలు (Scientists) తెలిపారు. ఇది యూబీఏ1 అనే జన్యువులో మార్పు కారణంగా కలుగుతుందని నిపుణులు పేర్కొన్నారు.

ఈ కొత్త వ్యాధి బారిన పడే పురుషుల సంఖ్య వేగంగా పెరుగుతోందని.. దీని బారిన పడితే ప్రాణాలకు ప్రమాదమని పరిశోధకులు పేర్కొంటుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)కి చెందిన నేషనల్ హ్యుమన్ జీనోమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NHGRI) శాస్త్రవేత్తలు ఈ కొత్త సిండ్రోమ్ ను కనుగొన్నారు. కాగా యుబిఎ 1 జన్యువులోని మ్యుటేషన్ వల్ల వచ్చే ఈ వ్యాధిని వాక్యూల్స్, ఈ1 ఎంజైమ్, ఎక్స్- లింక్డ్, ఆటో ఇన్ఫ్లమేటరీ అండ్ సోమాటిక్ సిండ్రోమ్(VEXAS)గా పిలుస్తారు.

నేను అందరినీ గాఢంగా ముద్దుపెట్టుకోగలను, చాలా బలంగా ఉన్నాను, ఫ్లోరిడా ప్రచార సభలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు, అమెరికా అధినేతకు కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపిన వైట్ హౌస్

ఇది పురుషులను మాత్రమే ప్రభావితం చేసే అరుదైన జన్యు వ్యాధిగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది కేవలం X క్రోమోజోమ్ తో ముడిపడి ఉండటం వల్ల, పురుషుల్లో మాత్రమే దీని ప్రభావం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, మహిళల అదనపు X క్రోమోజోమ్ వారికి రక్షణగా పనిచేస్తాయని, దీని వల్ల మహిళల్లో ఈ వ్యాధి సోకే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వ్యాధి నిర్థారణకు గాను 2,500 మంది రోగుల జన్యుశ్రేణులపై అధ్యయనం నిర్వహించారు. ఫలితంగా కొందరిలో యూబీఏ1 అనే జన్యువును వారిలో గుర్తించారు. ఇది వెక్సాస్ అనే ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ కు కారణమవుతుందని తేల్చి చెప్పారు. కొత్తగా కనుగొన్న ఈ జన్యు వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న రోగులలో 40 శాతం మంది ఇప్పటికే దీని నుండి కోలుకున్నారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.