Covid Pandemic: వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్, ఢిల్లీలో మూడవ దశకు కోవిడ్, మళ్లీ లాక్‌డౌన్ దిశగా ప్రపంచంలోని పలు దేశాలు, దేశంలో తాజాగా 48,648 మందికి కరోనా పాజిటివ్‌
Coronavirus Outbreak in India (Photo-PTI)

New Delhi, October 30: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 48,648 మందికి కరోనా పాజిటివ్‌ గా (Coronavirus Cases in India) నిర్థారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,88,851కి చేరింది. నిన్న ఒక్క రోజే 563 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,21,090 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

నిన్న 57,386 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 73,73,375 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,94,386గా ఉంది.కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,64,648 శాంపిళ్లను పరీక్షించామని, ఇప్పటివరకు 10,77,28,088 శాంపిళ్లను పరీక్షించామని ICMR(ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) తెలిపింది.

ఢిల్లీలో క‌రోనా మూడ‌వ ద‌శ‌కు : దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా మూడ‌వ ద‌శ‌కు (third Stage) చేరుకున్న‌ట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై ఆరోగ్య‌శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ స్పందించారు. మూడో వేవ్ ప్రారంభమైంద‌న‌డానికి ఇప్పుడే నిర్ధార‌ణ‌కు రాలేమ‌ని, మరో వారం రోజులు వేచి చూడాల్సి ఉందని ఆయన చెప్పారు. అయితే ఢిల్లీలో క‌రోనా (Covid in Delhi) మూడ‌వ ద‌శ‌కు చేరే అవ‌కాశం మాత్రం ఉంద‌న్నారు.

చైనా, పాకిస్తాన్‌కు చెక్ పెట్టేలా బెకా అగ్రిమెంట్, ఇంతకీ బెకా అంటే ఏమిటీ ? దీని ద్వారా ఇండియాకు కలిగే ప్రయోజనం ఏమిటీ? బీఈసీఏ ఒప్పందంపై పూర్తి సమాచారం

ఒక్క రోజులోనే ఎన్న‌డూ లేని విధంగా కొత్తగా 5,673 కేసులు నమోదు కావ‌డ‌మే ఇందుకు కార‌ణం. గ‌త వారం రోజులుగా ఢిల్లీలో రోజూ స‌గ‌టున సుమారు 4వేల‌కు పైగా కొత్త కేసులు (COVID-19 Infections) న‌మోదవుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న విష‌యం. ప్ర‌స్తుతం ఢిల్లీలో 29,378 యాక్టివ్ కేసులుండ‌గా మొత్తం కేసుల సంఖ్య 3.7 ల‌క్ష‌ల‌కు చేరుకుంది

మళ్లీ లాక్ డౌన్ : మహారాష్ట్రలో కరోనా వైరస్‌ కేసుల పెరుగుదల కొనసాగుతుండటంతో లాక్‌డౌన్‌ను నవంబర్‌ 30 వరకూ పొడిగించినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 రోజువారీ కేసులు పడిపోయినా దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 1,30,286 యాక్టివ్‌ కేసులున్నాయి.

అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం మరోసారి పొడగింపు, కార్గో విమానాలు మరియు ఇప్పటికే షెడ్యూల్ చేయబడిన సర్వీసులకు నిషేధం వర్తించదని స్పష్టతనిచ్చిన డీజీసీఏ

అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ఈనెల ఆరంభంలో మహారాష్ట్ర ప్రభుత్వం 50 శాతం కెపాసిటీ మించకుండా హోటళ్లు, ఫుడ్‌కోర్టులు, రెస్టారెంట్లు, బార్లను తెరిచేందుకు అనుమతించింది. అయితే స్కూళ్లు, కాలేజీలు విద్యాసంస్ధలను మాత్రం అనుమతించలేదు. అత్యవసర సేవల్లో విధులు నిర్వహించే ఉద్యోగుల కోసం ప్రత్యేక సబర్బన్‌ రైళ్ల రాకపోకలను అధికారులు అనుమతించారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ సెకండ్ వేవ్:ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ సెకండ్ వేవ్ వణికిస్తోంది. ఇంగ్లండ్‌లో ప్రస్తుతం రోజుకు లక్ష కేసులు కొత్తగా నమోదవుతుండగా, ప్రతి తొమ్మిది రోజులకు ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన వచ్చే వారానికి రోజుకు రెండు లక్షల చొప్పున కరోనా వైరస్‌ కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.

రెండో దశలో కరోనా వైరస్‌ బారిన పడి కనీసం 85 వేల మంది మరణించే అవకాశం ఉంది. రెండో దశ కరోనాను కట్టడి చేయడం కోసం మొదటి దశకన్నా పగడ్బంధీగా ‘లాక్‌డౌన్‌’ ఆంక్షలను అమలు చేయాల్సి ఉంది’ అంటూ కరోనా విజంభణపై నియమించిన సేజ్‌ కమిటీ గత రాత్రి ఇంగ్లండ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

కరోనాతో ప్రమాదకర పరిస్థితుల్లో కొన్ని దేశాలు, రాబోయే నెలలు ఇంకా డేంజర్, పాఠశాలలను మూసివేయాలని సూచించిన డబ్ల్యూహెచ్ఓ అధ్యక్షుడు టెడ్రోస్

లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకులతో కూడిన సేజ్‌ కమిటీ అక్టోబర్‌ 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా మహమ్మారి రెండో దశ విజంభణ ప్రారంభమైనట్లు తెల్సింది. మరో దఫా ‘లాక్‌డౌన్‌’గానీ, ఆంక్షలనుగానీ విధించాలని దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌పై శాస్త్రవేత్తల ఒత్తిడి పెరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల చివరి నాటికి మతుల సంఖ్య కూడా గణనీయంగా పెరగుతుందని, రోజుకు 800 మంది చొప్పున మరణించే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు.

కరోనా వైరస్‌ మొదటి దశ విజంభణలో దాదాపు 40 వేల మంది మరణించారు. రెండు దశలో దాదాపు 85 వేల మంది మరణించే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేశారు. అంటే, రెండింతలకుపైగా. దేశవ్యాప్తంగా 86 వేల మంది శాంపిల్స్‌ను పరిశీలించడం ద్వారా వైరస్‌ రెండో దశ కొనసాగుతున్నట్లు వారు నిర్ధారణకు వచ్చారు.

తగ్గుతున్న రోగ నిరోధక శక్తి:ఇదిలా ఉంటే రోగ నిరోధక శక్తి బ్రిటీష్‌ ప్రజల్లో క్రమంగా తగ్గుతూ వస్తోందని తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తేటతెల్లం అవడం ఆందోళనకరమైన విషయం. కరోనా వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరగుతున్న నేపథ్యంలో రోగ నిరోధక శక్తి కూడా ప్రజల్లో అదే శాతంలో లేదా అంతకన్నా ఎక్కువ మందిలో పెరగుతూ రావాలి. కానీ అందుకు విరుద్ధంగా తగ్గడం బ్రిటీష్‌ శాస్త్రవేత్తలకు అంతుపట్టకుండా ఉంది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీ బాడీస్‌కు సంబంధించి గత జూన్‌ నెలలో నిర్వహించిన పరీక్షల్లో బ్రిటన్‌ జనాభాలో ఆరు శాతం జనాభాలో యాంటీ బాడీస్‌ ఉన్నట్లు తేలింది.

సెప్టెంబర్‌ నెల నాటికి యాంటీ బాడీస్‌ కలిగిన వారి సంఖ్య 4.4 శాతానికి పడిపోయిందని తేలింది. దేశంలోని మొత్తం జనాభాకుగాను దేశ నలుమూలల నుంచి 3,65,000 మంది శాంపిళ్లను సేకరించడం ద్వారా ‘రియాక్ట్‌ 2’ పేరిట పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడయింది.

ఫ్రాన్స్‌లో మరోసారి లాక్‌డౌన్:  కరోనా అత్యంత ప్రభావిత దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్‌లో మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. కోవిడ్‌-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు డిసెంబరు 1 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ బుధవారం ప్రకటించారు. దేశంలో వైరస్‌ వేగంగా విస్తరిస్తోందని, పరిస్థితులు చేయి దాటిపోయే పరిస్థితి కనిపిస్తోందని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

రాజధాని నగరం పారిస్‌ సహా ఇతర ప్రధాన పట్టణాల్లో రెండువారాల క్రితమే కర్ప్యూ విధించినా కరోనా కేసుల(సెకండ్‌వేవ్‌)ను కట్టడి చేయలేకపోయామని, సెకండ్‌వేవ్‌లో ఇప్పటికే దేశంలో 35 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయని పేర్కొన్నారు.