అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)‌, ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను (Kamala Harris) చంపుతానంటూ బెదిరించిన వ్యక్తి ఎఫ్‌బీఐ కాల్పుల్లో హతమయ్యాడు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన కాల్పుల్లో అతడు మృతిచెందినట్లు ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (FBI) అధికారులు తెలిపారు.యూటా రాష్ట్రానికి (Utah state) చెందిన క్రెయిగ్‌ రాబర్ట్‌సన్‌ (Craig Robertson) అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో వీరిపై బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే.యూటా రాష్ట్రంలో అధ్యక్షుడు బైడెన్ పర్యటనకు కొన్ని గంటల ముందు ఎఫ్‌బీఐ అధికారులు రాబర్ట్‌సన్ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిపిన కాల్పుల్లో అతడు మరణించాడని అధికారులు వెల్లడించారు.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)