Joe Biden at election rally in California | (Photo Credits: Getty Images)

New York, August 19: నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటిక్‌ పార్టీ జో బిడెన్‌ను (Democrat Joe Biden) తమ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్‌ చేసింది. ఇది జో బిడెన్‌ (Joseph Biden) రాజకీయ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు. బిడెన్‌ గతంలో రెండు సార్లు అధ్యక్ష పదవికి తలపడ్డారు. డెమోక్రటిక్‌ తరఫున తనను అధ్యక్ష పదివికి నామినేట్‌ చేసినందుకు బిడెన్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఏడాది న‌వంబ‌ర్ 3వ తేదీన అధ్య‌క్ష ఎన్నిక‌లు (US Presidential Elections 2020) జ‌ర‌గ‌నున్నాయి.

ప్ర‌స్తుత అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో (Donald Trump vs Joe Biden) ఆయ‌న పోటీప‌డతారు. డెమోక్ర‌టిక్ పార్టీ (Democratic Party) పార్టీకి చెందిన మాజీ అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్, జిమ్మీ కార్ట‌ర్‌లు.. బైడెన్‌ను అధ్య‌క్ష అభ్య‌ర్థిగా ప్ర‌తిపాదించారు. మాజీ విదేశాంగ మంత్రి కొలిన్ పావెల్ కూడా త‌న మ‌ద్ద‌తు తెలిపారు. అధికారికంగా అధ్య‌క్ష అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో బిడెన్ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు. పార్టీ నామినేష‌న్‌ను అంగీక‌రించ‌డం త‌న జీవితానికి గౌర‌వంగా భావిస్తాన‌ని జోసెఫ్ రాబినెట్ బిడెన్ తెలిపారు.

Here's The Tweet: 

ఈ మేరకు ‘డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి నన్ను నామినేట్‌ చేయడం నా జీవితానికి లభించిన అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తున్నాను’ అంటూ బిడెన్‌ ట్వీట్‌ చేశారు. ‘మీ అందరికి ధన్యవాదాలు. ఈ ప్రపంచం నాకు, నా కుటుంబానికి మద్దతుగా ఉందని విశ్వసిస్తున్నాను’ అని తెలిపారు. డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ (డీఎన్‌సీ) రెండవ రోజు ఈ కార్యక్రమం జరిగింది. అధ్యక్ష ఎన్నికలకు కేవలం 77 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ రెండున్నర నెలల కాలం బిడెన్‌ భవిష్యత్తుని నిర్ణయించనుంది. స్వదేశం, విదేశాలలో ట్రంప్‌ సృష్టించిన గందరగోళాన్ని సరిచేయగల శక్తి, అనుభవం బిడెన్‌ సొంతమంటుని డెమోక్రాట్లు భావిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం చేసే వారికి గుడ్ న్యూస్,హెచ్‌1బీ వీసా హోల్డర్స్ పాత ఉద్యోగ‌మే కొన‌సాగించేందుకు ట్రంప్ సర్కార్ అనుమతి

బిడెన్‌ను అధ్య‌క్ష అభ్య‌ర్థిగా నామినేట్ చేస్తూ 50 రాష్ట్రాలు అనుకూలంగా ఓటేశాయి. క‌రోనా నేప‌థ్యంలో పార్టీ స‌మావేశాలు వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో సాగాయి. అయితే నాలుగ‌వ రోజున స‌మావేశాల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న‌ట్లు బిడెన్ తెలిపారు. ఓపీనియ‌న్ పోల్స్ ప్ర‌కారం.. ట్రంప్ వెనుకంజ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. శ్వేత సౌధానికి బిడెన్ రేసులో నిల‌బ‌డ‌డం ఇది మూడ‌వ‌సారి.