Washington, August 13: అమెరికాలో ఉద్యోగానికి అవసరమైన హెచ్1బీ వీసా (H1B Visa) విషయంలో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్1బీ వీసాదారులు (visa holders) తమ పాత ఉద్యోగాన్ని కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. హెచ్1బీతోపాటు వివిధ రకాల విదేశీ వర్క్ వీసాలను ఈ ఏడాది డిసెంబరు వరకూ రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ప్రస్తుతం అమల్లో ఉంది. అయితే తాజాగా హెచ్1బీ వీసా ఉన్నవాళ్లు పాత ఉద్యోగమే కొనసాగించేందుకు ట్రంప్ సర్కార్ అనుమతి ఇచ్చింది.
ఈ వీసాలపై నిషేధానికి ముందు ఏ ఉద్యోగం చేశారో, అదే ఉద్యోగంలో కొనసాగేందుకు అనుమతులు మంజూరు చేసింది. అలాగే, ఆ వీసాదారులపై ఆధారపడేవాళ్లు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు అగ్రరాజ్యం (America) ప్రయాణం చేసేందుకు అనుమతి కల్పించారు. విదేశాలలో చిక్కుకున్న హెచ్ 1బీ వీసాదారులు అమెరికాలో ఉద్యోగాలకు తిరిగి వస్తే వీసాలు పొందటానికి అవకాశం కల్పిస్తున్నట్టు ఇమ్మిగ్రేషన్ అటార్నీ గ్రెగ్ సిస్కిండ్ ట్వీట్ చేశారు. అయితే అది వీసా నిషేధానికి ముందు జరిగినదై ఉండాలన్న షరతు విధించినట్టు తెలిపారు. అమెరికా కీలక నిర్ణయం, విదేశీ వర్కర్లకు ఇచ్చే వీసాలు రద్దు
ప్రాధమిక వీసాదారులతో పాటు డిపెండెంట్లు (జీవిత భాగస్వాములు, పిల్లలు) కూడా అనుమతినిస్తున్నట్టు యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ అడ్వైజరీ తెలిపింది. గతంలో దేశంలో ఏ కంపెనీకి పని చేశారో.. ఏ స్థాయిలో ఉన్నారో..వారు దేశంలోకి రావచ్చునని పేర్కొది.
Here's Tweet
Also, a number of other exceptions for H-1Bs who are technical specialists and managers. I'm on the call for the visa ban case now but will summarize later.. pic.twitter.com/BpebjuCjGn
— (((Greg Siskind))) (@gsiskind) August 12, 2020
అలాగే సాంకేతిక నిపుణులు, సీనియర్ స్థాయి మేనేజర్లు ఇలా తమ స్థాయికి తగిన జాబ్స్ చేసినవారికి కూడా మళ్ళీ ఆహ్వానం పలుకుతున్నామని ట్రంప్ ప్రభుత్వం వివరించింది. కరోనా మహమ్మారి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ట్రంప్ ఈ చర్య తీసుకున్నట్టు సమాచారం. వలసవాదులకు అమెరికా షాక్, 60 రోజుల పాటు అమెరికాలోకి ఎవరూ ఉద్యోగాల కోసం రాకుండా నిషేధం
హెచ్1బీ, ఎల్1 వీసాలు ఉన్నవారిపై జూన్ 22వ తేదీన అధ్యక్షుడు ట్రంప్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికా కార్మికులను రక్షించుకునేందుకు ఈ ఏడాది చివరి వరకు వీసా బ్యాన్ విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే ట్రంప్ సర్కార్ ప్రణాళికలను వ్యతిరేకిస్తూ ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. పబ్లిక్ హెల్త్, హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్, రీసర్చ్‌ర్లకు కూడా ట్రావెల్ అనుమతి ఇస్తున్నట్లు అమెరికా సర్కార్ చెప్పింది.
అమెరికా పౌరసత్వాన్ని వదులుకునే ఇతర దేశస్తుల సంఖ్య బాగా పెరిగినట్లు తెలిస్తోంది. బ్రిటన్ నిర్వాసితులు, యుఎస్ ప్రవాస పన్నుతదితర ఇతర సంబంధిత విషయాలలో ప్రత్యేకత ఉన్న న్యూయార్క్ సంస్థ బాంబ్రిడ్జ్ అకౌంటెంట్స్... విడుదల చేసిన అధికారిక గణాంకాల ఆధారంగా ఈ ఏడాదిలో... గడచిన మొదటి ఆరు నెలల కాలంలో... సుమారుగా 5,800 మందికి పైగా పౌరులు... తమ అమెరికా పౌరసత్వాన్ని వదులుకోగా, 2019 లో మొత్తం 2,072 మంది తమ అమెరికా పౌరసత్వాన్ని వదిలివేసినట్లు బాంబ్రిడ్జ్ అకౌంటెంట్స్ ప్రకటించింది.