US ICE: విదేశీ విద్యార్థులకు దిమ్మతిరిగే షాకిచ్చిన అమెరికా, ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించే స్కూళ్లలో ప్రవేశం పొందే విద్యార్థలకు నో వీసా, స్పష్టం చేసిన యుఎస్ ఐసీఈ
US ICE Representational Image (Photo Credits: unsplash.com)

Washington, July 7: అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు (Students In US) భారీషాక్ లాంటి వార్తే ఇది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు విద్యాసంస్థలు మొగ్గు చూపినట్లయితే విదేశీ విద్యార్థులు అమెరికా (America) విడిచి వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అదే విధంగా కొత్తగా విద్యార్థి వీసాలు (US Study Visa) జారీ చేయబోమని పేర్కొంది. వచ్చే విద్యా సంవత్సరానికి గానూ పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు నిర్ణయించిన స్కూళ్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వీసా జారీచేయబోమని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) (US Immigration and Custom Enforcement) స్పష్టం చేసింది. కరోనావైరస్‌పై కొత్త ట్విస్టు, ఈ వైరస్ గాలి ద్వారా సోకుతుందని నిర్ధారించిన సైంటిస్టులు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాసిన 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు

అలాంటి వారిని యూఎస్‌ కస్టమ్స్‌ అండ్‌ బార్డర్‌ ప్రొటెక్షన్‌ దేశంలోకి అనుమతించదు. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా (ఎఫ్‌-1 ఎం-1-తాత్కాలిక ప్రాతిపదికన జారీ చేసేవి) మీద ప్రస్తుతం అమెరికాలో ఉండి ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్న వాళ్లు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది, లేదా చట్టబద్ధంగా అమెరికాలో ఉండాలనుకుంటే స్కూల్‌కు వెళ్లేందుకు అనుమతి ఉన్న విద్యా సంస్థకు బదిలీ చేయించుకోవాలి. అలా జరగని పక్షంలో ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని అనుసరించి ఎదురయ్యే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి’’అని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎడారి దేశంలో భారతీయుల ఘోష, కువైట్‌లో 8 లక్షల మంది ఇండియన్ల పాలిట శాపం కానున్న ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లు, ఆమోదం పొందితే దేశం వదలాల్సిందే

ఎఫ్‌1, ఎం1 విద్యార్థుల‌కు మాత్రం వెస‌లుబాటు క‌ల్పిస్తున్న‌ట్లు అమెరికా ఇమ్మిగ్రేష‌న్ శాఖ వెల్ల‌డించింది. ఆన్‌లైన్ చ‌దువుల కోసం రిజిస్ట‌ర్ చేసుకున్న వారు దేశం విడిచి వెళ్లవ‌చ్చు అంటూ ఐసీఈ పేర్కొన్న‌ది. ఒక‌వేళ అలాంటి విద్యార్థులు దేశంలోనే ఉంటే.. వారు తీవ్ర ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని అమెరికా హెచ్చ‌రించింది. ఎఫ్‌-1 వీసా విద్యార్థులు అకాడ‌మిక్ కోర్సును, ఎం-1 వీసా విద్యార్థులు వొకేష‌న‌ల్ కోర్సుల‌ను చ‌దువుకోవ‌చ్చు అని ఐసీఈ వెల్ల‌డించింది. సుమారు 11 ల‌క్ష‌ల మంది విదేశీ విద్యార్థుల‌కు అమెరికాలో యాక్టివ్‌ స్టూడెంట్ వీసాలు ఉన్నాయి.