Representational Purpose Only (File Image)

Texas , May 27: ఒక యువకుడు (US teen) తన తల్లిదండ్రులతోపాటు (Teen Murders Parents) తోబుట్టువులను దారుణంగా హత్య చేశాడు. వారు నరమాంస భక్షకులని (Cannibals) ఆరోపించాడు. తనను కూడా తినడానికి ప్లాన్‌ చేయడంతో వారిని చంపినట్లు తెలిపాడు. అగ్ర దేశమైన అమెరికాలో ఈ సంఘటన జరిగింది. టెక్సాస్‌కు చెందిన 18 ఏళ్ల సీజర్ ఒలాల్డే మంగళవారం దారుణానికి పాల్పడ్డాడు. పేరెంట్స్‌తోపాటు అక్క, తమ్ముడిపై గన్‌తో కాల్పులు జరిపి హత్య చేశాడు. కాగా, సీజర్‌ సోదరి విధులకు రాకపోవడంతో సహ ఉద్యోగి ఒకరు ఆమె ఇంటికి వెళ్లాడు. తన కుటుంబ సభ్యులను కాల్చి చంపిన సీజర్‌ ఆ వ్యక్తిపై కూడా గన్‌ను (Gun) గురిపెట్టాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు, తోబుట్టువులను హత్య చేసి తాను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడబోయిన సీజర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Man Killed By 40 Crocodiles: గుడ్ల కోసం వెళ్లిన 70 ఏళ్ల వృద్ధుడిని ముక్కలు చేసి తినేసిన 40 మొసళ్లు, రక్తంతో నిండిపోయిన చుట్టుపక్కల ప్రాంతం 

తన కుటుంబ సభ్యులు నరమాంస భక్షకులని అతడు ఆరోపించాడు. తనను కూడా తినేందుకు వారు ప్లాన్‌ చేసినట్లు పోలీసులకు చెప్పాడు. మరోవైపు ఇంట్లోని పలు చోట్ల కుటుంబ సభ్యులను కాల్చి చంపిన ఆ యువకుడు వారి మృతదేహాలను బాత్‌రూమ్‌లోకి ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు గ్రహించారు.

Covid New Wave in China: చైనాలో రెండు కొత్త కరోనా వేరియంట్లు, వారంలో 65 లక్షల మందికి పైగా కోవిడ్ బారీన పడే ప్రమాదం, వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాను పెంచిన డ్రాగన్ కంట్రీ 

ఆ ఇల్లంతా రక్తమయంగా ఉండటం చూసి షాక్‌ అయ్యారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సీజర్‌ వినియోగించిన బుల్లెట్‌ కేసింగ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులను దారుణంగా చంపడంపై కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్‌ చేశారు.