WikiLeaks Founder Julian Assange. (Photo Credits: ANI)

Britan, Mar 24: వికీలీక్స్ తో అప్పట్లో పెను రాజకీయ సంచలనమే సృష్టించిన జూలియన్ అసాంజే (Julian Assange) ఓ ఇంటివాడయ్యారు. ఇప్పటికే తన ప్రేయసితో ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన ఆయన.. ఆమెను జైలులోనే ( UK high-security jail) వివాహమాడారు. వికీలీక్స్ లో భాగంగా అత్యంత రహస్యమైన ఆర్మీ సమాచారాన్ని బయటకు లీక్ చేశారన్న కేసుకు సంబంధించి ఆయన 2019 నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే బ్రిటన్ లోని బెల్మారిష్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

జైలులోనే పెళ్లి చేసుకునేందుకు అధికారులు అనుమతినివ్వడంతో తన ప్రేయసి స్టెల్లా మోరిస్ ను ఆయన.. తన పిల్లలు నలుగురు అతిథుల సమక్షంలోనే మనువాడారు. వారి పెళ్లికి ఇద్దరు సాక్షులు, ఇద్దరు గార్డులు వెంట ఉన్నారు. పెళ్లి సందర్భంగా తనకు ఆనందంగానూ..మరోవైపు బాధగానూ ఉందని స్టెల్లా అన్నారు. జూలియన్ ను (WikiLeaks' Assange) మనస్ఫూర్తిగా ప్రేమించానని చెప్పారు. వివాహం అనంతరం జైలు గేటు బయట ఆమె.. అసాంజే మద్దతుదారుల నడుమ కేక్ కట్ చేశారు.

శ్రీలంక ఇంతలా ఆర్థిక సంక్షోభంలో కూరుకోపోవడానికి కారణాలు ఏంటి, పర్యాటక దేశంలో ఇంత విపత్తు ఎందుకు వచ్చింది, చైనా వల్లే ఈ సంక్షోభం తలెత్తిందా.. శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై ప్రత్యేక కథనం

వికీలీక్స్ కేసుకు సంబంధించి అమెరికా అధికారులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో అసాంజే అమెరికా నుంచి పారిపోయి వచ్చారు. వివిధ దేశాల్లో తలదాచుకున్నారు. కొన్నాళ్లు లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో ఉన్నారు. ఆ క్రమంలోనే 2011లో అక్కడే పనిచేస్తున్న లాయర్ అయిన స్టెల్లాను తొలిసారి కలిశారు. 2015లో ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెళ్లాడారు. కాగా, ఆయన్ను అమెరికాకు తీసుకెళ్లేందుకు అగ్రరాజ్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎక్స్ ట్రాడిషన్ కు సంబంధించి ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దానికి ప్రభుత్వం కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇటు తనను అమెరికాకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అసాంజే పెట్టుకున్న అర్జీని బ్రిటన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది.