Newdelhi, June 25: ఏండ్లనాటి వైన్ (Wine) తాగడం అంటే మందుబాబులకు ఎంతో ఇష్టం. రెండు, మూడేండ్ల కిందటి వైన్ ఉంటేనే గొప్పగా చెప్పుకునే రోజులివి. అయితే, స్పెయిన్ (Spain) లోని కర్మొనాలో గల ఒక రోమన్ సమాధిలో అత్యంత పురాతనమైన వైన్ ఒకటిని పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. రెడ్ వైన్ గా గుర్తించిన ఈ వైన్ 2 వేల ఏండ్ల నాటి పురాతనమైనదని పేర్కొన్నారు. తాజాగా కనుగొన్న ఈ పాత వైన్ స్వచ్ఛమైనదేనని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పీహెచ్ విలువ తదితర అనేక రసాయన పరీక్షల అనంతరం ఈ విషయం చెప్తున్నట్టు వెల్లడించారు.
World's oldest wine found in 2000-year-old Roman tomb https://t.co/SfGPlbqpXc An urn found in a tomb in Spain contained... pic.twitter.com/rMeJH674WJ
— Health365Info.com (@health365Info) June 21, 2024
రికార్డు చేంజ్
క్రీ.శ. 4వ శతాబ్దం నాటిదిగా చెప్తున్న వైన్ ను ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైన్ గా ప్రస్తుతం గుర్తిస్తున్నారు. అయితే, తాజాగా ఆ రికార్డును ఈ రోమన్ వైన్ చేజిక్కించుకుంది.