New York (Photo-Wikimedia Commons)

New York, Dec 2: ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల (World's Most Expensive Cities) జాబితాను ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వార్షిక సర్వే ప్రకటించింది.ఇందులో (Economist Intelligence Unit’s annual survey) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ సిటీ (New York ranked most expensive city) మొదటి స్ధానంలో నిలిచింది.

ఇంధన ధరలు పెరిగిపోయి, ద్రవ్యోల్బణం గరిష్ఠాలకు చేరిన తరుణంలో న్యూయార్క్ నగర జీవనం మరింత ఖరీదుగా మారిపోయింది. గడిచిన పదేళ్లలో ఎనిమిది పర్యాయాలు అత్యంత ఖరీదైన నగరంగా ఉన్న సింగపూర్ ఈ విడత న్యూయార్క్‌తో కలసి మొదటి స్థానాన్ని ఆక్రమించింది.ఆస్ట్రేలియాలోని సిడ్నీ కూడా తొలిసారిగా టాప్ 10లోకి ప్రవేశించింది.

సొంత దేశం ఓడిపోయిందని సంబరాలు, యువకుడిని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపిన ఇరాన్ భద్రతా దళాలు

గతేడాది మొదటి స్థానంలో ఉన్న టెల్ అవీవ్ ఈ ఏడాది ర్యాంకుల్లో మూడో స్థానానికి పరిమితమైంది. రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్ ర్యాంకింగ్స్‌లో 88 స్థానాలు ఎగబాకాయి. హాంగ్ కాంగ్ 4, లాజ్ ఏంజెలెస్ 5, జూరిచ్ 6, జెనీవా 7, శాన్ ఫ్రాన్సిస్కో 8, ప్యారిస్ 9, సిడ్నీ, కోపెన్ హెగెన్ 10వ స్థానాల్లో ఉన్నాయి. నివాస వ్యయం తక్కువగా ఉన్న టాప్ 10 నగరాల్లో.. డమాస్కస్ 172, ట్రిపోలి 171, టెహ్రాన్ 170, ట్యూనిస్ 169, తాష్కెంట్ 168, కరాచీ 167, ఆల్మెటీ 166, అహ్మదాబాద్ 165, చెన్నై 164, అల్జీర్స్ 161, బెంగళూరు 161, కొలంబో 161వ స్థానాల్లో ఉన్నాయి.

ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ కొత్త చీఫ్‌గా హసన్ అల్ హషిమీ అల్ ఖురేషి, సిరియా తిరుగుబాటు పోరులో పాత చీఫ్ హసన్ అల్ హషిమీ మృతి

ప్రపంచంలోని పెద్ద పట్టణాల్లో సగటు జీవన వ్యయం 8 శాతం మేర పెరిగింది. ఇస్తాంబుల్ లో 86 శాతం, బ్యూనోస్ ఎయిర్స్ లో 64 శాతం, టెహ్రాన్ లో 57 శాతం మేర ధరలు పెరిగాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠాలకు చేరడంతో న్యూయార్క్ మొదటి స్థానంలో నిలవడానికి కారణమైంది.