జింబాబ్వేలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన బిలియనీర్, ఆయన తనయుడితో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. భారత్‌కు చెందిన హర్పాల్ సింగ్ రంధావా రియోజిమ్ పేరుతో మైనింగ్ కంపెనీని నిర్వహిస్తున్నారు. అలాగే నికెల్, రాగి తదితర లోహాలను శుద్ధి చేస్తుంటారు. జింబాబ్వే రాజధాని హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా ప్రైవేట్ జెట్‌లో వెళ్తున్న సమయంలో మషావా ప్రాంతంలో విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఆరుగురు మరణించారు.ప్రమాదానికి గురైన విమానాన్ని సెసెనా 206గా గుర్తించారు.ఈ సింగిల్ ఇంజిన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు. సాంకేతిక లోపంతో విమానం గాల్లో ఉన్న సమయంలోనే పేలిపోయినట్లు తెలుస్తున్నది.
Here's News
Zimbabwe Plane Crash: Indian Tycoon Harpal Randhawa’s Son Among Six Killed in #Mashava Aircraft Accident #Zimbabwe #PlaneCrash https://t.co/5jeeyxYnRx
— LatestLY (@latestly) October 2, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)