November 8: ప్రైవేట్ రంగ బ్యాంక్ దిగ్గజం ఐసీఐసీఐ (ICICI Bank) తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాల్లో ఈ ఏడాది కొత్తగా 57 బ్రాంచీ(57 branches)లను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఏపీలో 23, తెలంగాణలో 34 బ్యాంక్‌లు రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త బ్రాంచీలతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో వీటి సంఖ్య 402కి చేరుతుందని, వీటిల్లో ఏపీలో 179, తెలంగాణలో 223 శాఖలు ఉండనున్నాయి. వీటికి తోడు మొత్తం 1,580 ఏటీఎంలను ఐసీఐసీఐ నిర్వహిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఐసీఐసీఐ శాఖలను విస్తరిస్తున్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2019-20)లో దేశవ్యాప్తంగా మొత్తం 450 కొత్త శాఖలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐసీఐసీఐ ఎగ్జ్సిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చి వెల్లడించారు.
కర్నూలు జిల్లా(ఆంధ్రప్రదేశ్)లో బ్యాంకు సౌకర్యం లేని కరివెన(Karivena in Kurnool), మహబూబ్‌నగర్(తెలంగాణ) జిల్లాలోని బోయిన్‌పల్లె (Boinpalle in Mahabubnagar ) గ్రామాల్లో కొత్తగా శాఖలను ఐసీఐసీఐ ప్రారంభించనుంది.
ఇదిలా ఉంటే ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. గురు నానక్ జయంతి సందర్భంగా ఖాతాదారులకు ఏకంగా 55 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ట్రావెల్, డైనింగ్, షాపింగ్ వంటి వాటికి ఇది వర్తిస్తుంది. అయితే ఇక్కడ అమృత్‌సర్‌లోని వారికి మాత్రమే ఈ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్లు ఈ నెల మొత్తం అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా హోమ్ లోన్స్, వాహన రుణాలు, టూవీలర్ లోన్స్, పర్సనల్ లోన్స్‌పై కూడా బ్యాంక్ ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుతో మేక్‌మైట్రిప్ ద్వారా జరిపే లావాదేవీలపై 55 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. క్యాబ్ బుకింగ్స్‌పై రూ.550 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది.