Hyderabad, Nov 5: ఏడాదిన్నర కిందట రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) (RBI) ఉపసంహరించుకున్న రూ.2 వేల నోట్లు (RBI 2000 Notes) ఇంకా పెద్దయెత్తున జనబాహుళ్యంలో ఉన్నట్టు సమాచారం. రూ.6,970 కోట్ల విలువ కలిగిన రూ.2వేల నోట్లు ప్రజల వద్ద ఇంకా ఉన్నాయి. ఈ మేరకు ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తున్నది. 2023 మే 19న రూ.2 వేల నోట్లు ఉపసంహరించినట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ ప్రకటన చేసే నాటికి దేశంలో 3.56లక్షల కోట్ల విలువైన 2వేల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి.
Nearly 98 pc #Rs2000 #banknotes returned; Rs 6,970 crore worth notes still with public https://t.co/smGOqOxKbH
— The Tribune (@thetribunechd) November 4, 2024
ఇప్పటికీ ఇవ్వొచ్చు
దేశంలో చలామణి అయిన రూ.2వేల నోట్లలో దాదాపు 98.04 శాతం నోట్లు ఇప్పటివరకూ ప్రజల నుండి తిరిగి బ్యాంకులకు వచ్చి చేరినట్లుగా ఆర్బీఐ తెలిపింది. రూ.6,970 కోట్ల విలువ కల్గిన రూ.2వేల నోట్లు ప్రజల వద్ద ఉన్నట్లు వెల్లడించింది. కాగా, ఇప్పటికీ, ఆర్బీఐ కార్యాలయాల్లో ఈ నోట్లను తీసుకుంటున్నారు.