Newdelhi, Nov 15: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు షాకింగ్ వార్త. అయితే ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR- ఎంసీఎల్ఆర్)లో 0.05 శాతం పెంచినట్లు ప్రకటించింది. దీంతో ఇది తొమ్మిది శాతానికి చేరుకుంది. ఇదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన పాలసీ రెపోరేటును వరుసగా పదవసారి 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది.
SBI raises lending interest rate by 5 basis points across select tenures https://t.co/I8C4CrQCCd
— SanthanamVaidya (@sanvai) November 15, 2024
హెచ్‌డీఎఫ్ సీ ఇలా..
మరోవైపు, ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్ ఎంపిక చేసిన మెచ్యూరిటీ పీరియడ్ ల రుణాలపై ఎంసీఎల్ఆర్ ని 0.05 శాతం పెంచింది. ఒక సంవత్సరం కాలానికి ప్రామాణిక ఎంసీఎల్ఆర్ రేటు 9.45 శాతం వద్ద నిర్ణయించింది.