Hyderabad, June 10: తెలుగురాష్ట్రాల్లో సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి AP CM SY Jagan), కె చంద్రశేఖర్ రావులకు (TS CM KCR) టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి (S. S. Rajamouli) ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత కరోనా క్లిష్ట సమయంలో సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల స్పందించి.. అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఏపీలో థియేటర్ల ఫిక్స్‌డ్ పవర్ చార్జీల రద్దు చేయడం గొప్ప విషయమని ఏపీ సీఎంని కొనియాడారు. ఈ మేరకు బుధవారం ట్విటర్ వేదికగా రాజమౌళి ఓ పోస్ట్ చేశాడు. తెలంగాణలో సినిమా షూటింగ్‌లకు అనుమతి, ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్, ధియేటర్లు ప్రారంభించడానికి అనుమతి నిరాకరించిన తెలంగాణ సర్కారు
కాగా లాక్‌డౌన్ కారణంగా మూతపడ్డ సినిమా షూటింగ్స్ జూలై 15 తరువాత తిరిగి ప్రారంభించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకరించిన విషయం తెలిసిందే. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగాన్ని ప్రోత్సహించడానికి వీలుగా విశాఖపట్టణంలో సినిమా స్టూడియోలు నిర్మించుకోవాలనుకునే వారికి తక్కువ ధరకు స్థలాలు కేటాయించడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు.
Here's rajamouli ss Tweets
My sincere thanks to AP CM @ysjagan garu for giving the industry hope in the time of a global crisis that has hit the film fraternity and theatre owners. Grateful to the government for waiving off minimum fixed power charges on theatres which is a relief. @AndhraPradeshCM
— rajamouli ss (@ssrajamouli) June 9, 2020
Thank you @TelanganaCMO KCR garu for considering our request and allowing us to get back to work, and @YadavTalasani garu for streamlining the process.
Now the onus is on us as an industry to figure out how to work with the recommended safety guidelines in place. Quite a job!
— rajamouli ss (@ssrajamouli) June 9, 2020
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు పెద్దలు మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. సీఎం జగన్‌తో జరిగిన ఈ భేటీలో చిరంజీవితో పాటు హీరో నాగార్జున, నిర్మాతలు సురేశ్ బాబు, సి, కల్యాణ్, దామోదర్ ప్రసాద్, ‘దిల్’ రాజు, డైరెక్టర్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. Tollywood Team to Meet AP CM
కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం.ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఈ నెల 15నుంచి చిత్రీకరణలు జరుపుకునేందుకు సీఎం కేసీఆర్‌గారు వెసులుబాటు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్రీకరణలకు అనుమతి ఇవ్వాలని జగన్‌గారిని కోరగానే అనుమతి ఇవ్వడం సంతోషం. షూటింగ్‌లకు సంబంధించి విధి విధానాలు రూపొందించేందుకు మంత్రి పేర్ని నాని, అధికారులతో చర్చిస్తామన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో మినిమమ్ ఫిక్స్‌డ్ ఛార్జీలు భారంగా మారాయని, వాటిని ఎత్తేయాలని కోరగానే సానుకూలంగా స్పందించినందుకు జగన్‌గారికి కృతజ్ఞతలు. నంది అవార్డుల పంపిణీ చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మేం ప్రోత్సాహం కోరుకుంటున్నామనగానే 2019–20కి అవార్డులు ఇవ్వడానికి నిర్ణయించారు. ఈ ఏడాదిలోనే ఆ వేడుక జరుగుతుందనుకుంటున్నామని చిరంజీవి తెలిపారు.