Hyderabad, Apr 23: ఇటీవలే అమీర్ ఖాన్ (Aamirkhan), రణవీర్ సింగ్ (Ranveer Singh) లు డీప్ ఫేక్ (Deepfake) వీడియోల బారిన పడిన విషయం మరిచిపోక ముందే.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కు కూడా డీప్ ఫేక్ సెగ తగిలింది. కాంగ్రెస్ పార్టీ తరపున అల్లు అర్జున్ ప్రచారం చేస్తున్నట్టుగా ఉన్న ఓ డీప్ ఫేక్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృత్రిమ మేధ సాంకేతికత సాయంతో రూపొందించిన ఈ వీడియోను చూసిన వారెవరైనా అల్లు అర్జున్ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నాడని నమ్ముతారనడంలో అతిశయోక్తిలేదు. ఓపెన్-టాప్ కారులో బన్నీ నిలబడ్డట్టు వీడియోను రూపొందించారు. పక్కనే భార్య స్నేహారెడ్డి కూడా ఉన్నట్టు సృష్టించారు.
कांग्रेस के सम्मान में अल्लू अर्जून मैदान में।@alluarjun #Elections2024 pic.twitter.com/7DUvAyjbLf
— Er. Priyanka Jha (@JhaPriyankha) April 20, 2024
ఆ వీడియో సాయంతో..
2022లో అల్లు అర్జున్ న్యూయార్క్ సందర్శనకు వెళ్లినప్పటి వీడియోను డీప్ ఫేక్ కు మూల వస్తువుగా ఉపయోగించుకున్నారని ప్రాథమికంగా అర్థమవుతోంది. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అల్లు అర్జున్ దంపతులు న్యూయార్క్ లో సెలబ్రేట్ చేసుకొని అక్కడ పరేడ్ నిర్వహించడం తెలిసిందే.