Hyderabad, Sep 29: టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) కాళ్లకు బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan) నమస్కరించారు. అబుధాబిలో జరిగిన ఐఫా ఉత్సవం-2024 (IIFA 2024 Awards)లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు దక్షిణాది నటీనటులతోపాటు బాలీవుడ్ తారలు కూడా హాజరయ్యారు. మణిరత్నం, సమంత, చిరంజీవి, బాలకృష్ణ, రానా దగ్గుబాటి, వెంకటేశ్, ఐశ్వర్యాయ్, షాహిద్ కపూర్, అనన్య పాండే, కృతి సనన్, కరణ్ జోహార్, జావేద్ అక్తర్, షబానా ఆజ్మీ వంటివారు హాజరై వేడుకకు గ్లామర్ ను జోడించారు.
Here's Video:
Bollywood Queen Aishwarya Rai respect towards #NBK ❤️😍👌
Aishwarya Rai receives the Best Actress (Tamil) Award from #NandamuriBalakrishna garu at #IIFAUtsavam2024 👏👌#IIFA #IIFAawards2024#AishwaryaRai #JaiBalayya pic.twitter.com/XBjgL48FYu
— manabalayya.com (@manabalayya) September 28, 2024
అలా ఆశీర్వాదం
తమిళ సినిమా పొన్నియన్ సెల్వన్ లో నటనకు గాను ఉత్తమ నటి అవార్డును బాలయ్య చేతుల మీదుగా అందుకునేందుకు స్టేజిపైకి వచ్చిన ఐశ్వర్యరాయ్ తొలుత ఆయన పాదాలకు నమస్కరించారు. బాలయ్య ఆమె తలపై చెయ్యిపెట్టి ఆశీర్వదించారు. ఆ తర్వాతే ఐశ్వర్య అవార్డు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బాలయ్య అభిమానులు షేర్ చేస్తూ మురిసిపోవడంతోపాటు ఐశ్వర్య సింప్లిసిటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గొప్ప నటి అయినప్పటికీ ఆమె తన ప్రవర్తనతో మరింత గొప్పగా ఎదిగారని కొనియాడుతున్నారు. నిజమే కదా!