Akkineni Nagarjuna caught in flood in Anantapur Watch Videos

అనంతపురంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి..రోడ్లపైకి వచ్చాయి. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్-బెంగళూరు రహదారిపై రాకపోకలు నిలిచపోయాయి. ఈ క్రమంలోనే సినీ నటుడు నాగార్జున వదరల్లో చిక్కుకుపోయారు. ఈరోజు (మంగళవారం) నాగార్జున ఓ జ్యూయలరీ షాపు ప్రారంభానికి అనంతపురం వచ్చారు.

వీడియోలు ఇవిగో, అనంతపురంలో ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలు, ఉగ్రరూపం చూపిస్తోన్న పండమేరు వాగు

అయితే మార్గమధ్యంలోనే ఆయనకు అడ్డంకులు ఎదురయ్యాయి. హైదరాబాద్ నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి విమానంలో వచ్చిన నాగార్జున అనంతపురం వస్తుండగా వరదల్లో చిక్కుకున్నారు. వెంటనే అప్రమత్తమైన జ్యూయలరీ షాపు యాజమాన్యంతోపాటు ఆయన అనుచరులు అక్కడి నుంచి మరో మార్గంలో అనంతపురానికి జాగ్రత్తగా తీసుకువచ్చారు. దీంతో నాగార్జునకు పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది.

Here's Videos