Hyderabad, Dec 14: శుక్రవారం అరెస్టై నిన్న రాత్రంతా చంచల్ గూడ జైలులో (Chanchalguda Jail) గడిపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) శనివారం ఉదయం 6.35 గంటల ప్రాంతంలో ఎట్టకేలకు విడుదల అయ్యారు. భారీ ఎస్కార్ట్ మధ్య జైలు వెనుక గేటు నుంచి బన్నీని అధికారులు పంపించారు. జైలు నుంచి గీతా ఆర్ట్స్ ఆఫీసుకు అటు నుంచి జూబ్లి హిల్స్ లోని తన నివాసానికి అల్లు అర్జున్ చేరుకున్నారు. తండ్రిని చూడగానే అయాన్ పరిగెత్తుకుంటూ వచ్చి అల్లు అర్జున్ ని హత్తుకున్నారు. అనంతరం భార్య స్నేహ, కూతురు అర్హ ఆయన్ని కలిశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. చట్టానికి తాను కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. చనిపోయిన మహిళ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు.
దేవుడ్ని అరెస్ట్ చేస్తారా? అల్లు అర్జున్ అరెస్ట్ పై రామ్ గోపాల్ వర్మ నాలుగు ప్రశ్నలు
జైలు నుండి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్
అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు నేను బానే ఉన్నాను
నేను చట్టాన్ని గౌరవిస్తాను,
నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు
రేవతి గారి కుటుంబానికి నా సానుభూతి
జరిగిన ఘటన దురదృష్టకరం ఇది అనుకోకుండా జరిగిన ఘటన
కేసు… pic.twitter.com/6dmBrFgbSE
— Telugu Scribe (@TeluguScribe) December 14, 2024
ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్
గుమ్మడికాయతో దిష్టి తీసిన కుటుంబ సభ్యులు
మీడియాతో మాట్లాడుతున్న అల్లు అర్జున్ pic.twitter.com/rFkynlwF72
— Telugu Scribe (@TeluguScribe) December 14, 2024
జైలు నుండి విడుదలైన అనంతరం ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ pic.twitter.com/L3Q3bMhjdt
— Telugu Scribe (@TeluguScribe) December 14, 2024
AYAN Happiness Chudandi antha Feel Ayindo 🥺🛐#WeStandWithAlluArjun #AlluArjun#AlluArjunArrestedpic.twitter.com/7sCZ0gHOrE
— Steve Bunny (@StevevHJ) December 14, 2024
జైలులో ఇలా..
అయితే, హైకోర్టు ఉత్తర్వులు అందడంలో జాప్యం, బెయిల్ కాపీ హార్డ్ కాపీ కోసం అధికారులు అడగడంతో నిన్న బన్నీ విడుదల ఆలస్యమైంది. దీంతో రాత్రంతా చంచల్ గూడ జైలులోని మంజీరా బ్లాక్ లోనే బన్నీ గడిపారు. జైలు గదిలో బన్నీని ముగ్గురు ఖైదీలు ఉండే బ్యారక్ లో ఉంచారు. అందులో ఆయనతో మరో ఇద్దరు విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నట్టు సమాచారం. జైలు అధికారులు డిన్నర్ ఆఫర్ చేసినా అర్జున్ తీసుకోలేదని సమాచారం. ఆయనకు కొత్త రగ్గు, కొత్త దుప్పటి అధికారులు ఇచ్చినట్టు తెలుస్తుంది.
అసలేమైంది??
పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, నిన్న ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేశారు.