Bhagats blaze a glimpse video is out - Pic YT Screengrab

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలలో చురుగ్గా ఉండటంతో పాటు, ఇటు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతుంది. శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. 'భగత్స్ బ్లేజ్' (Bhagat's Blaze) పేరుతో ఒక చిన్న టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియో చిన్నదే అయినా, దీని ఇంపాక్ట్ పెద్దగానే ఉంది.

ఇప్పుడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలయింది. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ అభిమానులకు, జనసేన కార్యకర్తలకు కొత్త జోష్ ఇచ్చేలా ఈ టీజర్ ను మేకర్స్ తీర్చిదిద్దినట్లుగా అనిపిస్తుంది. ఈ వీడియోలో పూజారుల గుంపుపై గూంఢాలు దాడి చేస్తుండగా, వారిని రక్షించడానికి వచ్చే  పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. అలాగే 'నీ రేంజ్ ఇది' అంటూ టీగ్లాస్ పగలగొట్టి హేళనగా మాట్లాడే ఒక రౌడీకి 'గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది' అంటూ కౌంటర్ వేస్తాడు 'గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. కనిపించని సైన్యం' అని మరొక డైలాగ్ ఉంది. జనసేన పార్టీ గుర్తు ఎన్నికల గుర్తు కూడా గ్లాస్ అని తెలిసిందే. ఈ విధంగా తమ పార్టీ పవర్‌ఫుల్ అని పరోక్షంగా టీజర్ ద్వారా చెప్పినట్లు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ టీజర్‌పై మీరూ ఒక లుక్ వేయండి.

Bhagat's Blaze- Ustaad Bhagat Singh Glimpse Video

ఈ టీజర్‌లో పవన్ కళ్యాణ్ కాస్త గడ్డంతో చాలా స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు, ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే ఈ సినిమాకంటే ముందు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG చిత్రాన్ని పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని సమాచారం.