Hyderabad, Oct 13: తెలంగాణ (Telangana) మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు నాగార్జున కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యంగ్యంగా స్పందించారు. ఎవరైనా పరువు కలిగినోళ్లు పరువునష్టం దావా వేస్తారు కానీ... పరువులేని నాగార్జున పరువునష్టం దావా వేయడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. బిగ్ బాస్ షోతో నాగార్జున ఎప్పుడో పరువు పోగొట్టుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నారాయణ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
పరువులేని వాడు పరువు నష్టం దావా ఎలా వేస్తాడు: సీపీఐ నారాయణ
నాగార్జునపై నారాయణ సంచలన కామెంట్స్@iamnagarjuna @NarayanaKankana#NagarjunaAkkineni #CPINarayana #BigTV pic.twitter.com/yNDqQzkJYn
— BIG TV Breaking News (@bigtvtelugu) October 12, 2024
నారాయణ ఏమన్నారంటే?
‘పరువు లేనోడు పరువునష్టం దావా వేస్తాడా? బిగ్ బాస్ షోతో పరువు పోగొట్టుకున్న నాగార్జున ఇప్పుడు కొండా సురేఖపై పరువునష్టం దావా వేశాడు. సమంత లాంటి వాళ్లు పరువునష్టం దావా వేస్తే అర్థం ఉంది కానీ... బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా అన్ పాప్యులర్ అయిన నాగార్జున పరువునష్టం దావా వేయడం అంటే అంతకంటే అవమానకరమైన విషయం మరొకటి ఉండదు. కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పిన తర్వాత ఇక దానిపై ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. నాగార్జున వంటి వ్యక్తి పరువునష్టం దావా వేయడం ఓ జోక్ లా అనిపిస్తోంది’ అని నారాయణ ఎద్దేవా చేశారు.
మెగాస్టార్ దసరా ట్రీట్.. చిరంజీవి విశ్వంభర టీజర్ రిలీజ్...విజువల్ వండర్‌గా టీజర్