Jagapathi Babu: ఆనందయ్య మందుపై జగపతి బాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు, కృష్ణపట్నం కరోనా మందును ఎప్పుడో తీసుకున్నాను, నాకు కరోనా రాలేదని వెల్లడించిన టాలీవుడ్ హీరో
jagapathi babu (Photo-Facebook)

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు ప్రముఖ నటుడు జగపతి బాబు (jagapathi babu) స్పందించారు. తాను ఆనందయ్య మందును ఎప్పుడు తీసుకున్నానని, ఆయుర్వేదం హాని చేయదని తాను బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు. జగపతి బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఆనందయ్య ఆయుర్వేద మందుని (Anandaiah Ayurvedic Medicine) వాడిన వారిలో తాను ఒకడినని, తనకు కరోనా (Coronavirus) రాలేదన్నారు.

ఆయుర్వేదం మందులను ప్రకృతి ఇచ్చిన సహజమైన ఔషధాలతో తయారు చేస్తారని, అలాంటి మందు ఎలాంటి హానీ చేయదన్నారు. ప్రకృతి, భూమాత తప్పు చేయదని చెప్పారు. ఆనందయ్య మందు విషయంలో చాలా మంది అభిప్రాయాలు చూశానని, రకరకాల వీడియోలు చూసిన తర్వాత ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు.

ఎవరేమన్నా.. ఈ ఆయుర్వేద మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవని.. ఖచ్చితంగా మంచే జరుగుతుందని తాను ఆనందయ్య మందును వాడినట్లు జగపతి బాబు తెలిపారు. అదృష్టవశాత్తు తనకు ఇప్పటి వరకు కరోనా రాలేదని, తాను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నానని అన్నారు. ఇంతకుముందు కూడా జగపతిబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజలను కాపాడేందుకు ప్రకృతి ఆనందయ్య రూపంలో ప్రపంచానికి మందును అందించి కాపాడుతోందన్నారు.

ఏపీలో పెరుగుతున్న డిశ్చార్జ్ రేటు, తాజాగా 15,958 మంది కోలుకుని ఇంటికి, గత 24 గంటల్లో కొత్తగా 10,373 కేసులు, 1.06 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపిన సింఘాల్

హైకోర్టు, ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో ప్రజలకు మందు పంపిణీ చేసేందుకు ఆనందయ్య ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్ ద్వారా హోండెలివరీ చేసేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది.

ఇదిలా ఉంటే ఇటీవలే ఏపీ సర్కార్ (Andhra Pradesh government) నుంచి గ్రీన్ సిగ్నల్ పొందిన ఈ మందుపై మొదటి నుంచి రకరకాల రూమర్లు వైరల్ అయ్యాయి. ఈ మందు వల్ల కరోనా తగ్గే అవకాశం లేదని, కొందరంటే మరికొందరేమో ఈ మందు తీసుకుంటే బ్లాక్ ఫంగస్ వస్తుందంటూ ఆరోపణలు చేశారు. అయితే ఇటీవల ప్రభుత్వ ఆమోదం లభించడంతో కొంత మేర ఈ రూమర్లకు చెక్ పడినట్లైంది.