Youtuber Harshasai Case: యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు
ముంబై కి చెందిన ఓ నటిపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్ తగిలింది. ఆయనపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
Mumbai, Oct 6: ముంబై కి (Mumbai) చెందిన ఓ నటిపై లైంగిక దాడి చేసినట్టు (Rape Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్ తగిలింది. ఆయనపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కేసు దర్యాప్తులో ముందుకు వెళ్లే క్రమంలో ఈ నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసు దర్యాప్తు చేస్తుండగానే, హర్షసాయిపై మరో మహిళ ఫిర్యాదు చేసింది. ఆన్ లైన్ లో తన పట్ల ట్రోలింగ్ కు పాల్పడుతున్నాడంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొనడం సంచలనంగా మారింది.
ఏమిటీ రేప్ కేసు?
హర్షసాయి తనపై అత్యాచారం చేశాడని, తన నగ్నచిత్రాలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ముంబైకి చెందిన ఓ నటి ఫిర్యాదు చేయగా, నార్సింగి పోలీసులు గత నెల 24న కేసు నమోదు చేయడం తెలిసిందే.
(The above story first appeared on LatestLY on Oct 06, 2024 09:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

