డార్లింగ్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా ‘సలార్: సీజ్‌ఫైర్’. తాజాగా ట్రైలర్ విడుదలైంది. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చినా..ఎట్టకేలకు డిసెంబరు 22న ఈ సినిమాను (Salaar Trailer) థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే 20 రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఇప్పటికే ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రియాక్షన్స్ అయితే వస్తున్నాయి. కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సలార్'. ఇద్దరు ప్రాణ స్నేహితులు.. బద్ధ శత్రువులైతే ఎలా? అనే లైన్‌తో మూవీ తీసినట్లు స్వయంగా ప్రశాంత్ నీలే చెప్పాడు. తెలుగు సహా ఐదు భాషల్లో ఈ ప్రచార చిత్రం సందడి చేస్తోంది. హీరో ఎలివేషన్, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇలా ప్రతిదీ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మార్క్‌కు తగ్గట్లు ఉంది. 3 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచడం ఖాయమనిపిస్తోంది.
ప్రభాస్, పృథ్వీరాజ్ పాత్రకు సంబంధించి బాల్య సన్నివేశాలతో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. విడుదలైన 15 నిమిషాల్లోనే 17 లక్షల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. అంటే నిమిషానికి లక్షమందికిపైనే ఈ ట్రైలర్‌ను వీక్షించారు.సలార్' టీజర్ లో ప్రభాస్ ముఖం చూపించకుండా ఎలివేషన్ ఇచ్చారు. ట్రైలర్‌తో మాత్రం దాదాపు అందరూ మెయిన్ లీడ్స్‌ని చూపించేశారు.
ట్రైలర్ చివరలో ప్రభాస్ కనిపించాడు. యాక్షన్ తో అదరగొట్టేశాడు. ఆ ఫైట్ సీన్స్ అన్నీ వేరే లెవల్ హై ఇస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం అలరిస్తోంది. శ్రుతిహాసన్ (salaar heroine) హీరోయిన్. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రతినాయకుడు. బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు టీనూ ఆనంద్, జగపతి బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు
విడుదలైన ట్రైలర్ ప్రకారం.. ఖన్సార్ అనే ప్రాంతాన్ని రాజమన్నార్(జగపతిబాబు) అనే వ్యక్తి ఏలుతుంటాడు. ఇతడి కొడుకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్). అయితే రాజమన్నార్ పనిమీద బయటకెళ్లినప్పుడు.. అతడి కొడుకుని అంతమొందించి, ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలని కొందరు ప్లాన్ చేస్తుంటాడు. దీంతో వరద రాజమన్నార్, తన చిన్నప్పటి ఫ్రెండ్ దేవా (ప్రభాస్) సహాయం తీసుకుంటాడు. చివరకు ఏమైంది? అనేదే 'సలార్' పార్ట్ 1 స్టోరీలాగా అనిపిస్తోంది.