AP CM Jagan pays last respects to Krishna (Photo-Video Grab)

సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళి అర్పించారు. అనంతరం ఘట్టమనేని కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎం జగన్‌. కృష్ణ కొడుకు మహేష్ బాబును హత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు కుటుంబ సభ్యులను సీఎంకు పరిచయం చేశారు. సీఎం జగన్‌ వెంట మంత్రి వేణుగోపాలకృష్ణ, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.హైదరాబాద్‌ పద్మాలయా స్టూడియోస్‌లో కృష్ణ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.

శ్వాస కోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న కృష్ణ ఆదివారం సాయంత్రం గుండెపోటుకి గురికాగా.. నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆయన్ని కుటుంబ సభ్యులు చేర్చారు.సోమవారం సాయంత్రం ఆయన పరిస్థితి విషమించగా.. మంగళవారం వేకువ ఝామున నాలుగు గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆయన అభిమాన గణం, యావత్‌ తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది.

కృష్ణగారి మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటని తెలిపిన సీఎం జగన్, నిజ జీవితంలో కూడా మనసున్న మనిషి అని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

బుధవారం తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణకు అంత్యక్రియలు జరుగుతాయి. ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు పద్మాలయా స్టూడియోలో ఆయన భౌతిక కాయన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తారు.