200 to 300 militants active in state says J&K Police chief (Photo-Ians)

J&K,October 7:  ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ , పాకిస్తాన్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటోంది. కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని దానిని టచ్ చేయవద్దని ఇండియా దాయాది దేశానికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ప్రపంచదేశాల ముందు తన గోడును వెళ్లబోసుకుంటోంది.మెజార్టీ ప్రపంచ దేశాలు దానికి ఏమాత్రం సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఐరాస వేదికగా ఇండియా మీద నిప్పులు కక్కింది. జమ్మూ కాశ్మీర్ వేదికగా మళ్లీ ఉగ్రదాడులకు వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా ఉగ్రవాదులను ఏదో రూపాన సరిహద్దులు దాటించి వారిని ఇండియాకు పంపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జమ్మూ కశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్‌ బాగ్ సింగ్ అలర్ట్ మెసేజ్ జారీ చేశారు.  బాలాకోట్ మెరుపు దాడులు వీడియో బయటకు..

పాకిస్థాన్ నుంచి సరిహద్దులు దాటి దాదాపు 300 మంది వరకూ టెర్రరిస్టులు ఇండియాలోకి చొరబడ్డారని జమ్మూ కశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్‌ బాగ్ సింగ్ తెలిపారు. ఎల్ఓసీ వెంట పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్, కాల్పులు జరుపుతున్న వేళ, ఉగ్రవాదులను సరిహద్దులు దాటించిందని ఆయన అన్నారు. పూంచ్ జిల్లాలో భద్రతపై సమీక్షించేందుకు వచ్చిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, కంచక్, ఆర్ఎస్ పుర, రాజౌరి, హీరానగర్, యూరి, నంబాల, కర్నాహ్, కేరన్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారత్ లోకి వచ్చారని తెలిపారు. గగనతలంలో దుమ్మురేపుతోన్న సుఖోయ్

కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్ రేంజర్లు, అదే సమయంలో భారత సైనికుల దృష్టిని మరల్చి ఉగ్రవాదులను పంపిస్తున్నారని తెలిపారు. వీరిని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని, గుల్ మార్గ్ సెక్టారులోని గందర్ బల్ సమీపంలో జరిపిన తనిఖీల్లో ఇద్దరు ఉగ్రవాదులు దొరికారని అన్నారు. ఎల్ఓసీ వెంబడి జరిపిన ఎన్ కౌంటర్లలో కొందరు ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెప్పారు. అక్రమంగా చొరబడిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఏరివేయడమే తమ లక్ష్యమని దిల్ బాగ్ సింగ్ అన్నారు.  అభినందన్ వర్థమాన్ సాహసానికి మరో గుర్తింపు, ఆయనతో పాటు టీం మొత్తానికి యూనిట్ సైటెషన్ అవార్డు

మీడియాతో మాట్లాడుతున్న డీజీపీ

ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయని ఆయన అన్నారు. జమ్మూ, లేహ్, కార్గిల్ ప్రాంతాల్లో పరిస్థితులు శాంతియుతంగానే ఉన్నాయన్నాయరు. కశ్మీర్ లో క్రమంగా శాంతియుల వాతావరణం నెలకొంటోందన్నారు. చొరబాట్లు యత్నాలు తీవ్రమైన నేపథ్యంలో పోలీసులు ,భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డిజీపీ ఆదేశించారు.