Vjy, July 29: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా పాల్గొన్నారు. త్వరలో ప్రజలకు అందించబోయే రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను ఈ సమీక్షలో చంద్రబాబు పరిశీలించారు. ఈ సమావేశంపై చంద్రబాబు ట్వీట్ చేశారు.
పట్టాదారు పాస్ పుస్తకాలపై తన బొమ్మ వేసుకుని తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత పాలకుడి తప్పులను సరిదిద్దుతున్నాం" అని వెల్లడించారు. తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులపై ఎవరి బొమ్మా ఉండకూడదన్నది ప్రజా అభిప్రాయం అని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. నాటి అహంకార పూరిత, పెత్తందారీ పోకడలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడి, వారి ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు తన ట్వీట్ లో వివరించారు.
ఇక గృహ నిర్మాణ శాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు (Chandrababu) ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలోప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం కేటాయించాలని నిర్ణయించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్‌రెడ్డి భేటీ, పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఏం మాట్లాడారనే చర్చ
గ్రామాల పరిధిలో పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో పేదలకు 2 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని.. కొత్త లబ్ధిదారులకు ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లే-అవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇళ్ల నిర్మాణమనేది తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశంగా ఉంటుందని సీఎం చంద్రబాబు సమీక్షలో స్పష్టం చేశారు. రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
వచ్చే ఏడాది కాలంలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను పక్కన పెట్టేసిందన్నారు. ఇళ్లు పూర్తయినా పేమెంట్లు చెల్లించ లేదని.. ఇలాంటి బాధిత లబ్ధిదారులకు చెల్లింపులు జరపాలని చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. మధ్య తరగతి ప్రజలకు ఎంఐజీ లే అవుట్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలనే అంశంపై చర్చ జరిగిందని.. ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి మౌలిక సదుపాయాలను కల్పించలేదని.. అలాంటి చోట మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఒక్క హౌసింగ్ శాఖలోనే రూ.10 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-2019 మధ్య కాలంలో నాలుగున్నర లక్షల మందికి రాష్ట్ర నిధులతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.