Newdelhi, Sep 28: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కు బిగ్ షాక్ తగిలింది. మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బెంగళూర్ తిలక్ నగర్ ఠాణా పోలీసులకు (Police) చట్టసభ ప్రతినిధుల కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల బాండ్ల పేరిట కొంత మంది పారిశ్రామిక వేత్తలను నిర్మల బెదిరించారని ఆరోపిస్తూ జనాధికారసంఘర్ష పరిషత్తుకు చెందిన ఆదర్శ్ అయ్యార్ అనే వ్యక్తి గతంలో తిలక్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదని ఆయన తెలిపారు.

ఉగ్ర ముప్పు హెచ్చరికలు.. ముంబై హైఅలర్ట్.. ఎక్కడికక్కడ తనిఖీలు

'హైడ్రా' కూల్చివేత‌ల భ‌యంతో కూక‌ట్‌ ప‌ల్లిలో మ‌హిళ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం.. ఈ ఘ‌ట‌న‌తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేద‌న్న క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్

ఈ క్రమంలోనే ఆదేశాలు

పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు.. పోలీసులపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది.. వెంటనే నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.