earthquake-threat-to-50-cities-including-vijayawada-mumbai-and-chennai (Photo-commons.wikimedia)

New Delhi, October 15: ప్రపంచంలో పర్యావరణం అత్యంత వేగంగా మారిపోతున్నది. దీంతో భూమిలో కూడా మార్పులు వస్తున్నాయి. భూమిలోపల ఉండే ప్లేట్ లెట్స్ లో ఒత్తిడి పెరుగుతుండటంతో భూమి కూడా షేక్ అవుతోంది. దీన్ని భూకంపం అని పిలుస్తుంటారు. ఈ భూకంపం మనదేశంలో హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే హిందూకుష్ పర్వతశ్రేణిలో ఉండే ఈ ప్లేట్ లెట్స్ ఎక్కువగా కదులుతుంటాయి. ఇటీవలే హిందూకుష్ కేంద్రంగా వచ్చిన భూకంపం కారణంగా పాక్ లో భారీ భూకంపం వచ్చింది. అటు నేపాల్ కూడా ఈ పరిధిలోనే ఉన్నది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కూడా ఈ జోన్ కిందకు వచ్చినట్టు తెలుస్తోంది. దేశంలో 50 నగరాలను భూకంపం వచ్చే నగరాలుగా గుర్తించారు. ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (NDMA),కేంద్ర ప్రభుత్వం కలిసి భూకంప ప్రభావిత ప్రాంతాల సూచిక (ఎర్త్‌క్వేక్ డిజాస్టర్ రిస్క్ ఇండెక్స్) (Earthquake Disaster Risk Index)రిపోర్టును రెడీ చేశాయి.ఈ రిపోర్టులో మొత్తం 50 నగరాల్లో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని తేలింది.సముద్రతీర ప్రాంతాల్లో ఎంతమంది ప్రజలు ఉంటున్నారు..? ఇళ్ల నిర్మాణం ఎలా ఉంది? ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి..? సముద్రానికి ఎంత దూరంలో ఉన్నాయి..? గతంలో ఎప్పుడైనా అక్కడ భూకంపాలు వచ్చాయా..? వంటి అంశాలను లెక్కలోకి తీసుకుని పరిశోధన చేశాయి. సుమారు మూడేళ్ల పాటు ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌లోని ఎర్త్‌క్వేక్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ERCC) చీఫ్ ప్రొఫెసర్ ప్రదీప్ తన విద్యార్థులతో కలిసి ఈ రిపోర్టును సిద్ధం చేశారు. ఆ రిపోర్ట్‌ని ఐఐటీ ప్రొఫెసర్లు, కేంద్రం మళ్లీ చెక్ చేశాయి.

మూడేళ్ల నుంచి పరిశోధన చేస్తున్న టీం

ఈ 50 నగరాలను మూడు భాగాలుగా విభజించారు. అందులో 13 నగరాలు అధిక భూకంప మండలంలోను, 30 మధ్యస్థ, 7 తక్కువగా ఉన్న నగరాలుగా గుర్తించారు. ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, పూణే, ముంబై, అహ్మదాబాద్, సిలిగురి, డార్జిలింగ్, చండీగఢ్ తో పాటు విజయవాడ కూడా అధిక భూకంప మండలంలో ఉన్నట్టుగా భూకంప ప్రభావిత ప్రాంతాల సూచిక పేర్కొన్నది. ఆయా ప్రాంతాల్లో భూకంపాలు వస్తే వాటి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఇదిలా ఉంటే విజయవాడ, దాని చుట్టూ 150 కి.మీ. పరిధిలోని ప్రాంతం భూకంప జోన్‌లో ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలోనే వెల్లడించింది. 2015 నాటికి ఈ ప్రాంతంలో 150 వరకు భూప్రకంపనలు నమోదయ్యాయని తెలిపింది. ఇక్కడి నేలల స్వభావం కారణంగా భూకంపం ముప్పు ఎక్కువని స్పష్టం చేసింది. తాజాగా విజయవాడ భూకంప ప్రభావ ప్రాంతాల్లో ఒకటని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ విద్యార్థులు 2015లో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. గుణదల, మొగల్రాజపురం, బందర్ రోడ్డు, కానూరు, పోరంకి, భవానీపురం, కొండపల్లి ప్రాంతాలు భూకంప జోన్‌లో ఉన్నాయని ఈ సర్వే తెలిపింది. విజయవాడ ప్రాంతం ఎత్తయిన భవనాల నిర్మాణానికి అనుకూలం కాదని ఆ అధ్యయనం వెల్లడించింది.