Amaravati, February 21: ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (APBIE) తన అధికారిక వెబ్‌సైట్‌లో థియరీ పరీక్ష కోసం అడ్మిట్ కార్డును (Admit Cards 2020) విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రెండవ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వొచ్చు. ఇంటర్ 1వ, 2వ సంవత్సరం హాల్ టికెట్లు 2020 డౌన్‌లోడ్ చేయడానికి విద్యార్థులు (Direct Download link) అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in ను సందర్శించాలి.
హోమ్‌పేజీలో ప్రవేశించిన తర్వాత రెండు లింక్‌లు కనిపిస్తాయి, దీనిలో మీకు కావాల్సిన లింక్ క్లిక్ చేస్తే, హాల్ టికెట్ డౌన్‌లోడ్ పేజీకి రీడైరెక్ట్ చేయబడుతుంది. అవసరమయ్యే డీటేల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ తెరపై కనిపిస్తుంది. అభ్యర్థులు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోడానికి ఈ క్రమసంఖ్యను ఫాలో అవ్వండి
స్టెప్ 1: bie.ap.gov.in లోకి లాగిన్ అవ్వండి
స్టెప్ 2: హోమ్‌పేజీలో పైన I.P.E. March-2020 Examinations క్లిక్ చేయాలి
స్టెప్ 3: తెరపై క్రొత్త పేజీ కనిపిస్తుంది
స్టెప్ 4: ఆధార్ నెంబర్ లేదా హాల్ టికెట్ నంబర్ ఇతర వివరాలు ఎంటర్ చేయండి
స్టెప్ 5: మీ హాల్ టికెట్ తెరపై కనిపిస్తుంది
స్టెప్ 6: దీన్ని డౌన్‌లోడ్ చేసి, ప్రింటౌట్ తీసుకోండి. ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇక పరీక్షల నిర్వహణ పూర్తిగా సీసీటీవీ పర్యవేక్షణలో నిర్వహించబడతాయి, ఏ విద్యార్థి అయినా చీటింగ్ చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని ఇంటర్ బోర్డ్ హెచ్చరించింది. ఇక హాజరు శాతం 60 శాతం కంటే తక్కువ ఉండే విద్యార్థులు పరీక్షలు రాయాలంటే ప్రిన్సిపల్ అనుమతి తప్పనిసరి అని బోడ్ పేర్కొంది. 60% మరియు 75% మధ్య హాజరు ఉన్న ఆర్ట్స్, సైన్స్ మరియు ఒకేషనల్ విద్యార్థులు లేదా రోల్ నెంబర్ అందుబాటులో లేని విద్యార్థులు కూడా వారి ప్రిన్సిపాల్ ను సంప్రదించాలని ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది.