 
                                                                 Amaravati, August 10: ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు (Schools Reopen in AP) పునఃప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ (Education Minister Adimulapu suresh) వెల్లడించారు. సాధారణ పనివేళల్లోనే పాఠశాలలు నడిపిస్తామన్నారు. అన్ని పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి అయిందన్నారు. మిగిలిన వారికి కూడా టీకాలు వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఆన్‌లైన్ తరగతులు జరగడం లేదని.. ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి ఆఫ్‌లైన్‌లోనే పాఠశాలలను నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16 నుంచి ఇంటర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు (AP Inter Clases) ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గత నెల 12 వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు కొనసాగుతున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు (AP Inter Second Year Regular Classes) నిర్వహించాలని కళాశాల యాజమాన్యాలకి, ప్రిన్సిపాళ్లకి ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీచేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు–2021 తేదీలు ఖరారయ్యాయి. ఈ సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్ విద్యామండలి తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
