Andhra Pradesh Education Minister Adimulapu Suresh. (Photo Credits: ANI)

Amaravati, Feb 3: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ బుధవారం మాట్లాడుతూ.. జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు ఉంటాయని తెలిపారు. సైన్స్ లో రెండు పేపర్లు ఉంటాయన్నారు. జులై 21 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందన్నారు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ ఏడాది 11 కి బదులుగా ఏడు పేపర్లు మాత్రమే ఉంటాయి . పరీక్షా కేంద్రాలు రెట్టింపు చేయబడతాయి మరియు పరీక్షల కోసం (AP SSC Exams Time Table 2021) కొత్త హాల్ టిక్కెట్లు మే 2021 లో విడుదల చేయబడతాయి.

ఎపి ఎస్‌ఎస్‌సి పరీక్షలు 2021 కి 6 లక్షలకు పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ ఏడాది అన్ని పరీక్షా కేంద్రాల్లో (Andhra Pradesh SSC Class 10 Exams Timetable 2021) సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షలన్నీ ఉదయం సెషన్‌లో నిర్వహించబడతాయి, అనగా ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:15 వరకు నిర్వహించ,బడతాయి.

ఏపీలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, మే 5 నుంచి 22 వరకు ఫస్టియర్‌ పరీక్షలు, మే 6 నుంచి 23 వరకు సెకండియర్ పరీక్షలు

ఇదిలా ఉంటే, ఏప్రిల్‌ 15 నుంచి స్కూళ్ళల్లో రెండో విడత నాడు – నేడు పనులను ప్రారంభంకానున్నాయి. డిసెంబర్‌ 31లోగా పనులు పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందిచాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

Here's Exams Schedule

Date Name of the Subject
June 07, 2021 Telugu Paper I/ Telugu Composite Course
June 08, 2021 Hindi
June 09, 2021 English
June 10, 2021 Mathematics
June 11, 2021 Physics
June 12, 2021 Biology
July 14, 2021 Social Studies

 

రెండో విడత నాడు – నేడు కోసం సుమారు 4,446 కోట్ల రూ. ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ పైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. టాయిలెట్ల నిర్వహణకు సులభ్‌ ఇంటర్నేషనల్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. టాయిలెట్ల నిర్వహణకోసం దాదాపు 49వేలమంది సిబ్బందిని వినియోగించనున్నారు.

సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ విడుదల, మే 4 నుంచి జూన్ 10 వరకు ఎగ్జామ్స్, యూజీసీ నెట్ 2021 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇక నుంచి స్కూళ్లకు ప్రత్యేక యాప్ ఉండనుంది. ఫిబ్రవరి 15 నుంచి అందుబాటులోకి రానుంది. పిల్లల హాజరు వివరాలను యాప్‌ ద్వారా అధికారులు సేకరించనున్నారు. స్కూల్‌కు పిల్లలు వెళ్ళకపోతే తల్లిదండ్రులకు యాప్ ద్వారా మెసేజ్ చేయనున్నారు. రెండో రోజు రానట్లైతే స్వయంగా వాలంటీర్లు వెళ్లి వాకబు చేయనున్నారు. ఈ మేరకు అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.