AP Entrance Exams New Dates: ఏపీలో సెట్స్‌ నిర్వహణ తేదీలు ఖరారు, సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకు ఇంజనీరింగ్‌ ఎంసెట్‌, అన్ని పరీక్షల తేదీల వివరాలు లోపల కథనంలో..
Representational Image (Photo Credits: PTI)

Amaravati, August 14: ఆంధ్రప్రదేశ్‌లో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం ప్రకటించారు. సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకూ ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇ‍క సెప్టెంబర్‌ 10,11 తేదీల్లో ఐసెట్‌, 14న ఈసెట్‌, 28,29,30 తేదీల్లో ఏపీ పీఈసెట్‌, అక్టోబర్‌ 1న ఎడ్‌సెట్‌, 2వ తేదీన లాసెట్‌ నిర్వహించనుంది.

ఇక తెలంగాణలో ఈ నెల 31న ఈసెట్, వచ్చే నెల 2న పాలిసెట్, వచ్చే నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రికల్చర్‌ ఎంసెట్‌ సహా లాసెట్, పీజీ ఈసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీఈసెట్‌ తేదీలను మాత్రం పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే టీసీఎస్‌ స్లాట్స్‌ను బట్టి ఖరారు చేయనుంది. కరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌ కారణంగా ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే.