AP EAMCET 2021 Results: ఈఏపీసెట్‌ (ఎంసెట్‌) 2021 ఫలితాలు విడుదల, 1,34,205 మంది విద్యార్థులు అర్హత, రేపటి నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపిన మంత్రి సురేష్
Exams Representational Image. |(Photo Credits: PTI)

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన ఏపీ ఎంసెట్-2021 (ఈఏపీసెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంజనీరింగ్‌కు సంబంధించి విజయవాడలో బుధవారం ఫలితాలు విడుదల చేశారు. 1,34,205 మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. దాదాపు 80 శాతం మంది అర్హత సాధించారని వెల్లడించారు.

విద్యార్థులు రేపటి నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. అగ్రి, ఫార్మా ఫలితాలు ఈ నెల 14న ప్రకటిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో.. మొదటి ర్యాంకు నిఖిల్‌ (అనంతపురం), 2వ ర్యాంకు మహంత నాయుడు (శ్రీకాకుళం), 3వ ర్యాంకు వెంకట తనీష్( వైఎస్‌ఆర్‌ జిల్లా), 4వ ర్యాంకు దివాకర్ సాయి, (విజయనగరం), మౌర్య రెడ్డి (నెల్లూరు) 5వ ర్యాంకు సాధించారు.