AP ICET Results 2023 Declared: ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల, టాపర్‌గా రేణిగుంటకు చెందిన తపల జగదీశ్‌కుమార్‌రెడ్డి, cets.apsche.ap.gov.in ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోండి
Representational Picture. Credits: PTI

ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్‌ 2023 ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను విడుద‌ల చేశారు.ఈ ఐసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2023 విద్యా సంవత్సరానికి ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు ఈ లింక్ ద్వారా చెక్ చేసుకోండి, ఇంజనీరింగ్లో 76.32 శాతం మంది ఉత్తీర్ణత, అగ్రికల్చర్లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత

మే 24, 25 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష రెండు షిఫ్ట్‌లో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వ‌హించారు.

AP ICET Results 2023 టాప్‌-10 ర్యాంక‌ర్లు వీళ్లే..

1. తపల జగదీశ్‌కుమార్‌రెడ్డి (రేణిగుంట)

2. వేదాంతం సాయివెంకట కార్తీక్ (సికింద్రాబాద్‌)

3. పుట్లూరు రోహిత్‌ (అనంతపురం)

4. చింతా జ్యోతి స్వరూప్‌ (విజయనగరం)

5. కానూరి రేవంత్‌ (విశాఖపట్నం)

6. మహమ్మద్‌ అఫ్తాద్‌ ఉద్దీన్‌ (పశ్చిమగోదావరి)

7. దేవరాపల్లి దేవ్‌ అభిషేక్‌ (విశాఖపట్నం)

8. జమ్ము ఫణీంద్ర (కాకినాడ)

9. పిరతి రోహన్‌ (బాపట్ల)

10. అంబళ్ల మహాలక్ష్మి (పశ్చిమగోదావరి)

ఏపీ ఐసెట్‌-2023 ఫ‌లితాలు లింక్ ఇదే..

https://results.sakshieducation.com/Results2023/Andhra-Pradesh/ICET/2023/ap-icet-results-2023.html

https://results.eenadu.net/ap-icet-2023/ap-icet-results-2023.aspx

https://cets.apsche.ap.gov.in/APSCHEHome.aspx

https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx