AP Inter Result 2022: త్వరలో ఏపీ ఇంటర్ ఫలితాలు, అన్నీ కుదిరితే జూన్ 15న విడుదలయ్యే అవకాశం, ఇంకా బోర్డు నుంచి అధికారికంగా రాని ప్రకటన
Exams Representational Image. |(Photo Credits: PTI)

ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. Board of Intermediate Education ఇంటర్ ఫలితాలను అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య టెన్త్ పరీక్షా ఫలితాలు వెలువడిన తరువాత ఇంటర్ విద్యార్థులు కూడా తమ ఫలితాల (AP Inter Result 2022) కోసం ఎదురుచూస్తున్నారు. కుదిరితే జూన్ చివరి నాటికి ఈ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఫలితాలు విడుదలయిన తరువాత మీరు అధికారిక వెబ్ సైట్ bie.ap.gov.inలో మీ వివరాలు చెక్ చేసుకోవచ్చు.

BIE AP Class 12 Exams 2022 మే 6 నుంచి మే24 మధ్యలో జరిగిన విషయం విదితమే. అయితే సైక్లోన్ హెచ్చరికల కారణంగా ఒక ఎగ్జామ్ వాయిదా పడింది. తరువాత దాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఏ క్షణంలోనైనా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు పేపర్లు దిద్దే ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. వాయిదా పడిన పేపర్ తో కలిపి మే 24 వరకు పరీక్షలు నిర్వహించబడ్డాయి. అన్నీ కుదిరితే జూన్ 15న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జూలై 6 నుంచి 15వ తేదీవరకు SSC సప్లిమెంటరీ పరీక్షలు, రెగ్యులర్‌ పరీక్షల మాదిరిగానే వారికి డివిజన్‌లు,జూన్ 20 రీ వెరిఫికేషన్ లాస్ట్ డేట్

అయితే దీనిపై ఇంటర్ బోర్డు నుంచి ఎలాంటి ప్రకటన కాని ధృవీకరించే స్టేట్ మెంట్ కాని ఇంకా రాలేదు. గతంలో విడుదలయిన విషయాలను బట్టి అంచనాకు రావడం జరిగింది. బోర్డు నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తరువాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.